మొన్న మేనల్లుళ్లు...నేడు బావమరిది: మసూద్ అజహర్‌కు గట్టి దెబ్బ

Siva Kodati |  
Published : Feb 26, 2019, 12:56 PM IST
మొన్న మేనల్లుళ్లు...నేడు బావమరిది: మసూద్ అజహర్‌కు గట్టి దెబ్బ

సారాంశం

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ ఉగ్రదాడికి సూత్రధారి, జైషే మొహమ్మద్ అధినేత మౌలనా మసూద్ అజహర్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామాకు ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌లో మసూద్ బావమరిది యూసఫ్ అజహర్ హతమయ్యాడు

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ ఉగ్రదాడికి సూత్రధారి, జైషే మొహమ్మద్ అధినేత మౌలనా మసూద్ అజహర్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామాకు ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌లో మసూద్ బావమరిది యూసఫ్ అజహర్ హతమయ్యాడు.

మంగళవారం తెల్లవారుజామున పీఓకేను దాటి పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫంక్తుఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్‌లో ఎయిర్‌ఫోర్స్ దాడి చేసింది. ఈ దాడిలో జైషే మొహమ్మద్ అతిపెద్ద ఉగ్రవాద శిబిరం నేలమట్టమైంది.

ఇక్కడి ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న మసూద్ బావమరిది యూసఫ్ అజహర్ అలియాస్ ఉస్తాద్ ఘోరీతో పాటు జైషే కమాండర్లు, ఉగ్రవాదులు, శిక్షకులు, జిహాదీలు హతమయ్యారు.

కొద్దిరోజుల క్రితం మసూద్ మేనల్లుళ్లు తాలా రషీద్, ఉస్మాన్‌లను భారత సైన్యం హతమార్చింది. దీంతో రగిలిపోయిన మసూద్ వారి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని జైషే ఉగ్రవాదులకు సూచించాడు.

దీనికి ప్రతీకారంగానే పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. దీనికి సూత్రధారి అయిన జైషే టాప్ కమాండర్, మసూద్‌కు అత్యంత నమ్మకస్తుడైన అబ్దుల్ రషీద్ ఘాజీని సైన్యం 48 గంటల్లోనే మట్టుబెట్టింది. తాజా సర్జికల్ స్ట్రైక్స్‌లో పెద్ద సంఖ్యలో మసూద్ బావమరిదితో పాటు ఉగ్రవాదులను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హతమార్చింది. 

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి, 21 నిమిషాల్లో పనికానిచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

సర్జికల్స్ స్ట్రైక్స్‌-2కు మిరాజ్‌-2000నే ఎందుకు వాడారంటే..?

పీఓకేలో మిరాజ్‌ను వెంటాడిన పాక్ ఎఫ్ 16...కానీ

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu