గాలిలో మిరాజ్ చక్కర్లు... ఉలిక్కిపడిన సరిహద్దు ప్రజలు

By Siva KodatiFirst Published Feb 26, 2019, 1:51 PM IST
Highlights

మంగళవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్తాన్ భూభాగంలోని టెర్రర్ క్యాంపులపై భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగింది. ఈ దాడిలో జైషే మొహమ్మద్, లష్కర్, హిజుబుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 300 మంది తీవ్రవాదులు హతమయ్యారు

మంగళవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్తాన్ భూభాగంలోని టెర్రర్ క్యాంపులపై భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగింది. ఈ దాడిలో జైషే మొహమ్మద్, లష్కర్, హిజుబుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 300 మంది తీవ్రవాదులు హతమయ్యారు.

తెల్లవారు జామున మిరాజ్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడంతో సరిహద్దు ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పూంఛ్ సెక్టార్‌తో పాటు ఎల్ఓసీ సమీప ప్రాంత ప్రజలు... ‘‘మేం నిద్రపోతుండగా పెద్ద శబ్ధంతో జెట్ విమానాలు ఆకాశంలో ఎగురుతున్నాయి.

మోర్టార్ షెల్స్ తమ గ్రామంలో పడటం చూశామని, కాల్పులు చూశామన్నారు. కానీ తెల్లవారుజామున ఆకాశంలో యుద్ధ విమానాలు ఎగరటం చూడటం చూసి యుద్ధం వచ్చిందేమోనని భయపడినట్లు కొందరు స్థానికులు తెలిపారు.

యుద్ధ విమానాలు బాంబులను జార విడిచిందేకు రెడీగా ఉండటంతో తన కుటుంబ సభ్యులందరూ గట్టిగా ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ ఉన్నారని మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.

దాదాపు 10 నిమిషాల పాటు యద్ధ విమానాలు నియంత్రణ రేఖ వెంబడి తిరిగిన శబ్ధం వినిపించినట్లు అక్కడి వాళ్లు తెలిపారు. అయితే ఎల్‌ఓసీ వెంట నివసించే ప్రజలను ముందస్తుగా ఖాళీ చేయించమని తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని సైనికాధికారులు తెలిపారు. 


 

click me!