చారిత్రాత్మక విజయం.. వందకోట్ల మార్క్ ను దాటబోతున్న టీకాడ్రైవ్.. సంబరాలకు అంతా సిద్ధం..

By AN TeluguFirst Published Oct 21, 2021, 8:29 AM IST
Highlights

CoWIN portal నుండి గత రాత్రి 10.50 నిమిషాలకు సేకరించిన గణాంకాల ప్రకారం దేశంలో ఇస్తున్న మొత్తం వ్యాక్సిన్ మోతాదులు బుధవారం నాటికి 99.7 కోట్లు దాటాయి, దాదాపు 75 శాతం మంది పెద్దలు first dose వేసుకున్నారు. 31 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి.

న్యూఢిల్లీ : ప్రారంభించిన తొమ్మిదినెలల్లోనే "ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్"గా రికార్డ్ నమోదు చేసిన టీకా డ్రైవ్ ఈ రోజు 1 బిలియన్ లేదా వందకోట్ల మోతాదులతో సరికొత్త రికార్డును నెలకొల్పబోతోంది. ఈ అద్భుతమైన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రభుత్వం ఉత్సవాలను ప్లాన్ చేస్తోంది.

vaccination driveకు సంబంధించిన 10 ముఖ్యమైన పాయింట్లు :

1
CoWIN portal నుండి గత రాత్రి 10.50 నిమిషాలకు సేకరించిన గణాంకాల ప్రకారం దేశంలో ఇస్తున్న మొత్తం వ్యాక్సిన్ మోతాదులు బుధవారంనాటికి 99.7 కోట్లు దాటాయి, దాదాపు 75 శాతం మంది పెద్దలు first dose వేసుకున్నారు. 31 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి.


2
అర్హులైన వారందరూ ఆలస్యం చేయకుండా టీకాలు వేయించుకోవాలని, ఈ "చారిత్రాత్మక" ప్రయాణానికి సహకరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి Mansukh Mandaviya విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎర్రకోటలో సింగర్ కైలాష్ ఖేర్ పాడిన పాటను, ఆడియో-విజువల్ ఫిల్మ్‌ని ఆవిష్కరిస్తారు. ఈ రోజు ఎర్రకోట వద్ద దాదాపు 1,400 కిలోల బరువున్న అతిపెద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది.
3
రైళ్లు, విమానాలు, నౌకలపై లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటనలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 100 శాతం టీకాలు పూర్తి చేసిన గ్రామాలు ఈ exerciseలో తమ పాత్రను సమర్థవంతంగా పోషించిన health workersను అభినందిస్తూ పోస్టర్లు, బ్యానర్లు వేయడం ద్వారా 100 కోట్ల డోసుల administered achievement సాధించినట్లు గుర్తించాలని కూడా పేర్కొంది.


4
నేషనల్ హెల్త్ అథారిటీ సిఇఒ ఆర్‌ఎస్ శర్మ బుధవారం మాట్లాడుతూ, "మేం సెకనుకు 700 టీకాలు వేస్తున్నాం. దీనివల్ల ఆ '100 కోటి' లబ్ధిదారులెవరో తెలుసుకోవడం కొంచెం కష్టమవుతుంది." అన్నారు.

5
బిజెపి నాయకులు టీకా కేంద్రాలను సందర్శించాలని ఆదేశాలు వచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి; వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనున్న యుపిలోని ఘజియాబాద్‌లో పార్టీ చీఫ్ JP Nadda  టీకా కేంద్రాలను సందర్శిస్తారు. ప్రధాన కార్యదర్శులు అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్ లు తమిళనాడులోని కోయంబత్తూర్, లక్నోలో ఉంటారు.
6
బిలియన్ వ్యాక్సిన్ మోతాదులను అందించడం.. - కరోనా మహమ్మారి ప్రభావం, స్థాయి, తీవ్రత దీనికి విరుగుడుగా వ్యాక్సిన్ తయారీ, పంపిణీ, డెలివరీ.. దాని చుట్టూ ఉన్న సవాళ్లు - ప్రభుత్వం ఎలాంటి ముఖ్యమైన ప్రయత్నాన్ని చేసిందో సూచిస్తుంది. ఇక ఒక బిలియన్ కంటే ఎక్కువ వ్యాక్సిన్ మోతాదులను ఇప్పటివరకు ఇచ్చిన రెండో దేశం భారత్ మాత్రమే. దీనికంటే ముందు చైనాలో జూన్‌లోనే 1 బిలియన్ మోతాదులను దాటింది. బిలియన్ కంటే ఎక్కువ జనాభాను కలిగి ఉన్న మరో ఏకైక దేశం Chinaనే.

7
గత నెలలో కేంద్రం - ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 71 వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా - ఒక రోజులో 2.5 కోట్లకు పైగా డోస్‌లను పంపిణీ చేశారు. ఒక రోజులో కోటికి పైగా డోస్‌లు ఇవ్వడం ఇది నాల్గవసారి. 

అయితే ఈ టీకాడ్రైవ్ లో కొన్ని అపశృతులూ వినిపించాయి. టార్గెట్ రీచ్ కావాలని చనిపోయిన వ్యక్తులకు కూడా వ్యాక్సిన్ లు వేసినట్టు మధ్యప్రదేశ్ లో కొన్ని షాకింగ్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 

8
ఏదేమైనా, ప్రతిపక్ష వామపక్ష పార్టీలతో సహా చాలా మంది red flagను సూచించారు - పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తుల సంఖ్య, ఒకే ఒక్క షాట్ ఉన్న వారి మధ్య వ్యత్యాసం చాలా ఉందని వారు పెదవి విరుస్తున్నారు. దేశంలోని 1.4 బిలియన్ ప్రజలలో కేవలం 20 శాతం మందికి మాత్రమే రెండు డోసులు పూర్తయ్యాయి.  

ఇది పండగల సీజన్‌.. ఇప్పుడు జనాలు ఎక్కువగా కలుస్తుంటారు. గ్రూపులుగా గుమిగూడతారు. ఇవన్నింటికి భిన్నంగా, ఇప్పటివరకు 51 శాతం మందికి కేవలం ఒక డోస్ మాత్రమే ఇవ్వబడింది, ఇది వైరస్ నుండి 30 నుండి 50 శాతం మాత్రమే రక్షణను అందిస్తుంది.


9
"అర్హులైన లబ్ధిదారులు గణనీయమైన సంఖ్యలో " second dose  తీసుకోలేదని ప్రభుత్వం చెప్పింది, కానీ ఈ నెంబర్లను పంచుకోవడానికి నిరాకరించింది. తెలంగాణలో అయితే, జూన్/జూలైలో మొదటి డోస్ తీసుకున్న 25 లక్షల మంది లబ్ధిదారులకు  second dose గడువు కూడా పూర్తయిపోయింది. 

10
సింగిల్ డోస్ తీసుకున్నవారు, రెండు డోసుల టీకాలూ పూర్తయిన వారి మధ్య తేడాలు ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలోనే ఉంది. ఇప్పటికే 450,000, లేదా 4.52 లక్షల మరణాలు నమోదు ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వానికి ఈ సమస్య గురించి తెలుసు. అందుకే, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రెండవ డోస్‌ల నిర్వహణపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చింది. ఈ రెండింటిమధ్య తేడాను తగ్గించడానికి వ్యూహాలను చెప్పాలని వారికి సూచించింది.

విమానంలో నటి నడుం పట్టుకుని ఒళ్ళోకి లాక్కుని అసభ్య ప్రవర్తన.. వ్యాపారవేత్తపై కేసు

click me!