విమానంలో నటి నడుం పట్టుకుని ఒళ్ళోకి లాక్కుని అసభ్య ప్రవర్తన.. వ్యాపారవేత్తపై కేసు

By AN TeluguFirst Published Oct 21, 2021, 7:30 AM IST
Highlights

టెలివిజన్ ఇండస్ట్రీకి చెందిన ఓ Television actress అక్టోబర్ 3న విమానంలో ఢిల్లీ నుంచి ముంబై కి వెళ్ళింది.  ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవడంతో ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో ఉన్న తన బ్యాగ్ తీసుకునేందుకు నటి సీట్లో నుంచి పైకి లేచింది.

ముంబయి : టెలివిజన్ నటితో ఓ వ్యాపారవేత్త అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి ఫిర్యాదుతో సదరు వ్యాపారవేత్త ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం అతడిని కోర్టులో హాజరు పరిచారు. 

మహిళలు ఎంత చదువుకున్నా.. ఉన్నత స్థానాల్లో ఉన్నా.. ఎంతటి ప్రగతి సాధించినా వారిని కేవలం తమకు ఆహ్లాదం కలిగించే దృష్టితో మాత్రమే చూసే ధోరణి సమాజంలో పోవడం లేదు. వారిమీద sexual abuse చేయడానికి వెనకాడడం లేదు.

మనం ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం? అనేదీ గమనించడం లేదు. అలాగని ఈ చర్యలకు పాల్పడుతున్నవారు.. చదువుకోనివారో, అజ్ఞానులో కాదు. చాలాసార్లు ఉన్నత స్థానాల్లో ఉన్న పురుషులు, సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలతో ఉన్నవారే కావడం విషాదం.

ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగానే Me Too movement మొదలయిన విషయం తెలిసిందే. అయినా మనిషిలోని ఆ బుద్ది మారడం లేదు. తాజాగా ఓ వ్యాపారవేత్త.. తనతో పాటు విమానంలో ప్రయాణిస్తున్న నటితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తరువాత బుకాయించడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు.  

పోలీసులు   తెలిపిన వివరాల ప్రకారం… టెలివిజన్ ఇండస్ట్రీకి చెందిన ఓ Television actress అక్టోబర్ 3న విమానంలో ఢిల్లీ నుంచి ముంబై కి వెళ్ళింది.  ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవడంతో ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో ఉన్న తన బ్యాగ్ తీసుకునేందుకు నటి సీట్లో నుంచి పైకి లేచింది.

అయితే పక్క సీట్లో ఉన్న ఓ Businessman నటి నడుం పట్టుకుని ఒక్కసారిగా ఒళ్ళోకి లాక్కున్నాడు. ఆమె ప్రతిఘటించడంతో బుకాయించాడు.  పురుషుడు అనుకొని అలా చేశానని ఆమెకు క్షమాపణలు తెలిపాడు. ఘటన అనంతరం ఇంటికి వెళ్లిన నటి జరిగిన తతంగం అంతా  Airlinesకు మెయిల్ చేసింది.

కలుషిత ఆహారం తిని...77మందికి అస్వస్థత..!

సదరు వ్యక్తి వివరాలు బహిర్గతం చేయాలని కోరింది.  అయితే తాము అలా చేయలేమని విషయాన్ని పోలీసులకు తెలియజేయాలంటూ సంస్థ సూచించింది.  దీంతో ఆమె అక్టోబర్ 4న ముంబైలోని సహర్ పోలీసులను ఆశ్రయించింది.  నటి ఫిర్యాదు ఆధారంగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యాపార వేత్తను పోలీసులు ఈ నెల 14న అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరచగా మరో 24 గంటల పాటు కోర్టు కస్టడీ విధించింది. 

ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని actressపై ఒత్తిడి
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విమానంలో జరిగిన విషయాలను బహిర్గతం చేసింది.  నిందితుడు చర్యతో ఎంతో భయాందోళనలకు గురి అయినట్లు తెలిపింది.  ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని వ్యాపారవేత్త కుటుంబసభ్యులు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వాపోయింది.  ‘ఆ ఘటనతో వణికిపోయాను.  అతడి భార్య,  ఓ వ్యక్తి మా ఇంటికి వచ్చి ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని నన్ను అడిగారు.  వారికి నా ఇంటి అడ్రస్ కూడా తెలిసిపోయింది.  మళ్లీ ఎవరైనా నా దగ్గరకు వస్తారేమోనని భయంగా ఉంది’  అంటూ వాపోయింది. 

click me!