India Pakistan War : ఇక పాక్ కు మూడినట్లే : 8 నగరాలపై ఇండియా డ్రోన్ ఎటాక్స్

Published : May 10, 2025, 08:08 AM ISTUpdated : May 10, 2025, 08:22 AM IST
India Pakistan War : ఇక పాక్ కు మూడినట్లే : 8 నగరాలపై ఇండియా డ్రోన్ ఎటాక్స్

సారాంశం

భారతదేశ సహనాన్ని పరీక్షిస్తూ వరుస క్షిపణి, డ్రోన్ దాడులకు దిగిన పాకిస్థాన్ కు ఇక మూడినట్లే.. భారత్ పాక్ నగరాలపై ప్రతిదాడులకు దిగింది. ఇస్లామాబాద్‌తో సహా ఎనిమిది పాకిస్థానీ నగరాలపై భారత్ డ్రోన్ దాడులు చేసినట్లు తెలుస్తోంది.  

India Pakistan War : జమ్మూ కాశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్ తీవ్ర దాడులు చేస్తున్న నేపథ్యంలో భారత్ కూడా ఎదురుదాడికి దిగింది. ఎనిమిది పాక్ నగరాలపై భారత్ ప్రతీకార దాడులు చేసింది. ఇస్లామాబాద్‌తో సహా ఎనిమిది పాకిస్థానీ నగరాలపై భారత్ డ్రోన్ దాడులు చేసిందని నివేదికలు వెల్లడించాయి. ఇస్లామాబాద్, రావల్పిండి, సియాల్‌కోట్, లాహోర్, పెషావర్, గుజ్రాన్‌వాలా, అటోక్ వంటి నగరాలపై భారత్ దాడులు చేసింది.

పాక్ యుద్ధ విమానం కూల్చివేసారనే వార్తలు కూడా వస్తున్నాయి. మూడు వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసిందని పాకిస్థాన్ ఆరోపించింది. అయితే ఈ సమాచారాన్ని భారత్ ఇంకా ధృవీకరించలేదు.

రాజధాని ఇస్లామాబాద్ సమీపంలోని విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున భారీ పేలుళ్లు సంభవించాయి. ఇస్లామాబాద్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఈ విమానాశ్రయం ఉంది. ఇది దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉంటుంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ విమానాశ్రయంతో సహా మూడు వైమానిక స్థావరాలపై పేలుళ్లు సంభవించాయని పాకిస్థాన్ ధృవీకరించింది.

 

నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం 

సరిహద్దులో పాక్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. రక్షణ, విదేశాంగ మంత్రులతో మోడీ సమావేశమయ్యారు. సైనిక అధికారులతో రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి నిన్న(శుక్రవారం) ఉదయం మీడియాతో మాట్లాడతారని ప్రకటించినప్పటికీ, దానిని వాయిదా వేశారు.

వరుసగా రెండో రోజు కూడా భారత్‌పై పాకిస్థాన్ దాడులు కొనసాగిస్తుంది. నియంత్రణ రేఖ వెంబడి బారాముల్లా నుండి భుజ్ వరకు 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఫిరోజ్‌పూర్‌లో జనావాస ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో ఒక కుటుంబంలోని ముగ్గురు గాయపడ్డారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu