ఇండియాలో కరోనా కేసుల తగ్గుముఖం:రెండో రోజూ 20 వేలకు దిగువనే కేసులు

By narsimha lodeFirst Published Oct 6, 2021, 10:25 AM IST
Highlights

ఇండియాలో గత 24 గంటల్లో 18,833 కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయి. దేశంలో నమోదౌతున్న కేసుల్లో ఎక్కువగా కేరళ రాష్ట్రంలో నుండే నమోదౌతున్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 2,46,,687కి చేరుకొన్నాయి.గత 203 రోజుల్లో corona యాక్టివ్ కేసులు అత్యల్పమని ఐసీఎంఆర్ ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు వరుసగా రెండో రోజు 20 వేలకు దిగువన నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజు 14,09,825 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 18,633 మందికి కరోనా నిర్ధారణ అయింది.

దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 2,46,,687కి చేరుకొన్నాయి.గత 203 రోజుల్లో corona యాక్టివ్ కేసులు అత్యల్పమని ఐసీఎంఆర్ ప్రకటించింది.నిన్న ఒక్క రోజే కరోనా నుండి 24,770 మంది కోలుకొన్నారు. దీంతో కరోనా రోగుల రికవరీ కేసుల సంఖ్య 3.38 కోట్లకు చేరింది. కరోనా కేసుల రికవరీ 97.94 శాతంగా నమోదైంది.

India లో కరోనా యాక్టివ్ కేసులు 2.5 లక్షలకు తగ్గినట్టుగా ICMR తెలిపింది.  కరోనాతో  మరణించిన రోగుల  మృతి ఆందోళన కల్గిస్తోందని కేంద్ర వైద్య  ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో కరోనాతో 278 మంది మరణించారు. 

also read:ఇండియాలో కరోనా తగ్గుముఖం: కేరళలో కొనసాగుతున్న కోవిడ్ కేసుల వ్యాప్తి

దేశంలో కరోనాతో ఇప్పటివరకు 4,48,538 మందికి చేరుకొంది.  ఇండియాలో నమోదౌతున్న కరోనా కేసుల్లో  అత్యధికంగా కేరళ రాష్ట్రంలో నుండే నమోదౌతున్నాయి.  గత కొంతకాలంగా కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడ కేరళ రాష్ట్రానికి బృందాన్ని పంపింది.  కేంద్ర బృందం కేరళ వైద్య ఆరోగ్య శాఖాధికారులకు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే.

click me!