LPG Gas Price : సామాన్యుడికి షాక్.. మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంతంటే...

By AN TeluguFirst Published Oct 6, 2021, 10:21 AM IST
Highlights

సెప్టెంబర్ నెలలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఈ నెలలో 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.43 పెరగడం సామాన్యులకు పెను భారంగా మారింది. ఇక తాజాగా పెరిగిన వంట గ్యాస్ ధరతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం గ్యాస్ ధర రూ.190 పెంచినట్లైంది. 

దేశంలో వంట గ్యాస్ ధరలు మళ్లీ మంటెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలతో సిలిండర్ల ధరలు ఆకాశానికి చేరుతున్నాయి. దీంతో వంట గ్యాస్ gas cylinders price బుధవారం రూ.15 పెరిగింది. ఢిల్లీలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.899.50కి చేరింది. 

కాగా సెప్టెంబర్ నెలలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఈ నెలలో 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.43 పెరగడం సామాన్యులకు పెను భారంగా మారింది. ఇక తాజాగా పెరిగిన వంట గ్యాస్ ధరతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం గ్యాస్ ధర రూ.190 పెంచినట్లైంది. 

ఇదిలా ఉండగా, ఐదు రోజుల క్రితమే 19కిలోల సిలిండర్ ధర అక్టోబర్ 1 నుండి ఢిల్లీలో రూ .1693 నుండి రూ .1736.50 కి పెరిగింది. కోల్‌కతాలో దీని ధర రూ .1805.50కు, ముంబైలో రూ .1685కు, చెన్నైలో రూ. 1867.50కి పెరిగింది. గత నెల సెప్టెంబరులో  రూ .75 మేర పెరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 884.5. కోల్‌కతాలో దీని ధర రూ .911. ముంబైలో కోసం రూ. 884.5, చెన్నైలో రూ. 900.5 గా ఉంది. 


 
ఎల్‌పి‌జి సిలిండర్ బుక్ చేయడానికి 8454955555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. అంతే కాకుండా వాట్సాప్ ద్వారా సిలిండర్లను కూడా బుక్ చేసుకోవచ్చు. రీఫిల్ అని టైప్ చేసి మీరు 7588888824 నంబర్‌కు మెసేజ్ చేయలీ దీంతో సిలిండర్ బుక్ అవుతుంది. గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా మారుతుంది. సగటు అంతర్జాతీయ బెంచ్ మార్క్, విదేశీ మారకపు రేట్లలో మార్పులు వంటి అంశాల ద్వారా దీని ధర నిర్ణయించబడుతుంది.

సి‌ఎన్‌జి -పి‌ఎన్‌జి ధరలు కూడా పెరగవచ్చు

కేంద్ర ప్రభుత్వం సహజ వాయువు ధరను 62 శాతం పెంచింది. గురువారం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వులలో ఈ విషయం తెలియజేసింది. సమాచారం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు ధర పెరిగిన తర్వాత కేంద్రం ఈ చర్య తీసుకుంది.

click me!