ఇండియాలో కరోనా కేసుల్లో హెచ్చు తగ్గుదల కన్పిస్తోంది. గత 24 గంటల్లో 15,906కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,41,75,468కి చేరింది.మరో వైపు కరోనాతో 561మంది చనిపోయారు.
న్యూఢిల్లీ: Indiaలో గత 24 గంటల్లో 15,906కొత్త Corona కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,41,75,468కి చేరింది.మరో వైపు కరోనాతో 561మంది చనిపోయారు. నిన్న ఒక్క రోజు 13,24,263 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,53,708కి చేరింది. మరోవైపు నిన్న 18,641మంది కరోనా నుండి కోలుకొన్నారు. దీంతో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 3,34,96,888కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
also read:వారం రోజులు ఇంటి వద్దే ఉండండి.. జీతాలిస్తాం.. కరోనా కట్టడి కోసం నిర్ణయం
undefined
కరోనా రోగుల రికవరీ రేటు 98.16శాతానికి చేరిందని వైద్య ఆరోగ్యశాఖాధికారులు ప్రకటించారు. మరో వైపు కరోనా యాక్టివ్ కేసులు 1,72,594 కి చేరింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 1.19 గా నమోదైంది. వారాంతపు కరోనా పాజిటివిటీ రేటు 1.23 గా నమోదైందని ICMR తెలిపింది.
30 రోజులుగా కరోనా కేసులు 30 వేల కంటే తక్కువగా నమోదయ్యాయి. 119రోజులుగా 50 వేల కంటే తక్కువ కోవిడ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.