కర్ణాటకలో విషాదం: నలుగురు బిడ్డలను విషమిచ్చి... రిటైర్డ్ జవాన్ ఆత్మహత్య

By Arun Kumar PFirst Published Oct 24, 2021, 8:51 AM IST
Highlights

భార్య లేకుండా వుండలేక ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ నలుగురు పిల్లలకు విషమిచ్చి అదే  విషాన్ని తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం కర్ణాటకలో చోటుచేసుకుంది. 

బెళగావి:  నలుగురు పిల్లలకు విషమిచ్చి చివరకు తానుకూడా అదే విషం తాగి ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్థాపంతో అతడు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈ దుర్ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... karnataka లోని బెళగావి జిల్లా బోరగల్ గ్రామానికి చెందిన  గోపాల్‌ హాదిమని (48), జయ(42) భార్యాభర్తలు. వీరికి సౌమ్య(19), శ్వేత(16), సాక్షి(11), సృజన్ (8) సంతానం. గోపాల్ భారత సైన్యంలో పనిచచేసి ఇటీవలే రిటైరయ్యాడు. చాలాకాలం కుటుంబానికి దూరంగా వున్న అతడు భార్యా పిల్లలతో ఆనందంగా గడిపుదామనుకునే సమయంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. 

corona second wave సమయంలో జయ వైరస్ బారినపడింది. కరోనా మహమ్మారి నుండి సురక్షితంగానే బయటపడ్డ ఆమెను బ్లాక్ ఫంగస్ బలితీసుకుంది. black fungus తో బాధపడుతూ కొన్నిరోజులు చికిత్స పొందిన ఆమె ఏడాది జూలై నెలలో మరణించింది. అప్పటినుండి భర్త గోపాల్ తో పాటు పిల్లలు కూడా తీవ్ర మనోవేధనతో బ్రతుకుతున్నారు. 

READ MORE  చావు.. రెండేళ్లు స్పీడుగా.. కరోనాతో తగ్గిన భారతీయుల ఆయుర్దాయం

భార్యలేమితో తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిన గోపాల్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం రాత్రి నలుగురు పిల్లలకు విషమిచ్చి అదే విషాన్ని తానుకూడా తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  శనివారం ఉదయం ఇంటి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారు చూడగా తండ్రీ పిల్లలు మృతిచెంది వున్నారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకేసారి తండ్రీ, నలుగురు పిల్లలు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది.  ఈ ఆత్మహత్యలపై మంత్రి గోవింద కారజోళ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 
 

click me!