ఇండియాలో గత 24 గంటల్లో 9765 కొత్త కేసులు: తగ్గిన రికవరీలు

By narsimha lodeFirst Published Dec 2, 2021, 10:27 AM IST
Highlights

ఇండియాలో గత 24 గంటల్లో 9,765 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు 3.46 కోట్లకు చేరుకొన్నాయి. కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 9,765 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 3.46 కోట్లకి చేరుకొన్నాయి. మరోవైపు కరోనాతో 477 మంది మృత్యువాత పడ్డారు. Indiaలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 99,763 చేరిందని icmr తెలిపింది.  ఇది 543 రోజుల కనిష్టానికి చేరింది.  నిన్న ఒక్క రోజే కరోనా నుండి 8,548మంది కోలుకొన్నారు. కరోనా రోగుల రికవరీ రేటు 98.35 శాతానికి చేరింది. దేశంలో కూడా కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,69,724కి చేరుకొంది.

also read:భారత్‌లో అదుపులోనే కరోనా.. కొత్తగా 8,954 కేసులు, ఒమిక్రాన్‌పై కొనసాగుతున్న నిఘా

కరోనా రోగులు మరణించిన సంఖ్య 0.29శాతానికి చేరింది. 2020 మార్చి  తర్వాత కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తక్కువగా చోటు చేసుకొందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా నుండి  ఇప్పటివరకు 3.40 కోట్ల మంది కోలుకొన్నారు. కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదౌతున్నాయి. కేరళ రాష్ట్రంలో 5 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో 24 గంటల్లో 403 మంది మరణించారు. దేశంలో నమోదైన కరోనా కేసుల్లోనూ, కరోనా మృతుల్లోనూ  కేరళ రాష్ట్రం నుండే అత్యధికంగా నమోదౌతున్నాయి.
 

click me!