దొంగ ప్రేమలో పడ్డ బ్యాంక్ క్యాషియర్... ఇద్దరూ కలిసి ఏం చేశారంటే..

By AN TeluguFirst Published Dec 2, 2021, 9:37 AM IST
Highlights

విజయపుర జిల్లా ముద్దేబిహాళ్ పట్టణంలోని  హడ్కో కాలనీలో యూనియన్ బ్యాంకుకు చెందిన ATMలో సెప్టెంబర్ 18  రాత్రి దోపిడీ జరిగింది.  అందులోని రూ. 16 లక్షల నగదు మాయం అయింది. నిందితులు ఏటీఎంను ఏ మాత్రం ధ్వంసం చేయకుండా... దర్జాగా lock తీసి నగదును దోచుకున్నారు. 

విజయపుర :  ఏటీఎం దోచుకున్న కిలాడీ ప్రేమికుల దోపిడి భాగోతం ఆలస్యంగా వెలుగు చూసినట్లు పోలీసులు తెలిపారు. ఓ బ్యాంకులో పనిచేస్తున్న క్యాషియర్ సొంత సంస్థకే ఎసరు పెట్టింది. తన ప్రియుడికి extortionలో సహకరించి, లక్షలు కొళ్లగొట్టాలని చూసింది.  ఈ నేరానికి కారణమైన నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల నుంచి దోపిడీకి గురైన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే…

విజయపుర జిల్లా ముద్దేబిహాళ్ పట్టణంలోని  హడ్కో కాలనీలో యూనియన్ బ్యాంకుకు చెందిన ATMలో సెప్టెంబర్ 18  రాత్రి దోపిడీ జరిగింది.  అందులోని రూ. 16 లక్షల నగదు మాయం అయింది. నిందితులు ఏటీఎంను ఏ మాత్రం ధ్వంసం చేయకుండా... దర్జాగా lock తీసి నగదును దోచుకున్నారు. ఈ విషయమై bank manager పోలీసులకు ఫిర్యాదు చేశారు.

accussed తమ ఆచూకీ ఎక్కడ బయట పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కేసు పరిష్కారం సవాలుగా మారింది.  కారణం ఏంటంటే.. ఏటీఎం కేంద్రంలో  Surveillance cameras కూడా లేవు. దీంతో నిందితుల  గురించిన ఏ చిన్న క్లూ కూడా లభించలేదు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

Mamata Banerjee: జాతీయ గీతాన్ని కూడా సరిగ్గా పాడలేరు.. దేశభక్తి అంటే ఇదేనా?: మమతా‌ బెనర్జీపై బీజేపీ ఫైర్

అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసును పోలీసులు ఓ సవాలుగా తీసుకుని,  దర్యాప్తు చేపట్టారు. దీనికోసం  ముందుగా దోపిడీ జరిగిన రోజున రాత్రి ముద్దేబిహాళ్ పట్టణంలోని  ఇతర ప్రాంతాల్లోని  నిఘా కెమెరాలను పరిశీలించారు. అందులో రికార్డైన దృశ్యాలను  విశ్లేషించారు. ఒక్కో కెమెరాలోని వీడియోలను పరిశీలిస్తుండగా  అన్ని కెమెరాల్లో కూడా ఒక కారు కనిపించింది. అందులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టుగా గుర్తించారు. ఆ కారు ఆ రోజు రాత్రి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు.

దీంతో వెంటనే కారు నంబర్ తో ట్రేస్ చేసి.. అందులోని వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో దోపిడీ వ్యూహం వెలుగుచూసింది. వివరాలు తెలిసి ముందుగా పోలీసులు షాక్ అయ్యారు. నిందితుల్లో ఒకడైన మంజునాథ్ అనే వ్యక్తిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా.... అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.  

బ్యాంకు క్యాషియర్ మస్మిత,  మంజునాథ్ ప్రేమికులని తెలిసింది. తన ప్రియుడికి ఆమె  ఏటీఎం కేంద్రం పాస్వర్డ్ను చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. ఈసంఘటనలో బ్యాంకు సెక్యూరిటీ గార్డు కూడా సహకరించినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు. మంజునాథ్ ను, అతనికి సహకరించిన నలుగురు స్నేహితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. 
 

click me!