పెరిగిన కరోనా రికవరీ కేసులు: ఇండియాలో మొత్తం కేసులు 3,45,72,523కి చేరిక

Published : Nov 28, 2021, 10:36 AM ISTUpdated : Nov 28, 2021, 10:50 AM IST
పెరిగిన కరోనా రికవరీ కేసులు: ఇండియాలో మొత్తం కేసులు 3,45,72,523కి చేరిక

సారాంశం

ఇండియాలో గత 24 గంటల్లో 8,774 కరోనా కేసులు నమోదయ్యాయి.  మొత్తం 3,45,72,523కి చేరుకొన్నాయి.  కరోనా యాక్టివ్ కేసులు 1.05,691 కి చేరుకొన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది. 

ఇండియాలో గత 24 గంటల్లో 8,774 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 3,45,72,523కి చేరుకొన్నాయి. మరోవైపు కరోనాతో 621 మంది మృత్యువాత పడ్డారు. దీంతో  దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,45,72,523కి చేరింది. ndiaలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1.05,691 లక్షలకి చేరిందని icmr తెలిపింది.  ఇది 543 రోజుల కనిష్టానికి చేరింది.  నిన్న ఒక్క రోజే కరోనా నుండి 9,481 మంది కోలుకొన్నారు. కరోనా రోగుల రికవరీ రేటు 98.34 శాతానికి చేరింది. 2020 మార్చి నుండి అధికమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.  దేశంలో ఇప్పటి వరకు కరోనా నుండి 3.39 కోట్ల మంది కరోనా  నుండి కోలుకొన్నారు.  

also read:తెలంగాణ: 24 గంటల్లో 160 మందికి కరోనా పాజిటివ్.. 6,75,479కి చేరిన కేసుల సంఖ్య

రోజువారీ కరోనా పాజిటివిటీ రేలు 0.80 శాతంగా నమోదైంది. 55 రోజులుగా 2 శాతం కంటే తక్కుగా నమోదైనట్టుగా కేంద్రం తెలిపింది. వారంతపు కరోనా పాజిటివిటీ రేటు 0.85 శాతంగా రికార్డైంది.1 శాతం కంటే తక్కువగా 14 రోజులుగా నమోదైనట్టుగా అధికారులు తెలిపారు. నిన్న ఒక్క రోజే  82 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ వేసుకొన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 121 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారు. కర్ణాటకలో  నిన్నఒక్క రోజే 322 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో మొత్తం కేసులు 29,95,285కి చేరుకొన్నాయి. కర్ణాటకలో 6754 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్క రోజే 176 మంది కరోనా నుండి కోలుకొన్నారు. కర్ణాటకలో  నిన్నఒక్క రోజే 322 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో మొత్తం కేసులు 29,95,285కి చేరుకొన్నాయి. కర్ణాటకలో 6754 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్క రోజే 176 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల్లో తగ్గుదల కన్పించడం లేదు. ఈ రాష్ట్రంలో కరోనా  మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.  కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదలతో పాటు కరోనాతో మరణించే రోగుల సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

 దక్షిణాప్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది.దీంతో కేంద్రం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇతర దేశాల నుండి వచ్చే వారిపై ఆంక్షలను కఠినతరం చేశాయి పలు రాష్ట్రాలు. ఒమిక్రాన్ వ్యాప్తి తీరుపై కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పరిశీలిస్తోంది., ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల్లో తగ్గుదల కన్పించడం లేదు. ఈ రాష్ట్రంలో కరోనా  మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న  రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్