వివాహేతర సంబంధం: వివాహితతో పాటు యువకుడిని విద్యుత్ స్థంభానికి కట్టేసి చిత్ర హింసలు

Published : Nov 28, 2021, 09:45 AM ISTUpdated : Nov 28, 2021, 09:46 AM IST
వివాహేతర సంబంధం: వివాహితతో పాటు యువకుడిని విద్యుత్ స్థంభానికి కట్టేసి చిత్ర హింసలు

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో వివాహితతో పాటు యువకుడిని స్థానికులు విద్యుత్ స్థంభానికి కట్టేసి చితక బాదారు. మూడు రోజుల పాటు వీరికి అన్న పానీయులు ఇవ్వలేదు.  ఈ ఘటనకు సంబంధించి వివాహిత భర్తను అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో  వివాహేతర సంబంధం నెపంతో వివాహితతో పాటు ఓ యువకుడిని కరెంట్ స్థంబానికి కట్టి చితకబాదారు. మూడు రోజుల పాటు కనీసం అన్న పానీయాలు ఇవ్వకుండా వారిని తీవ్ర చిత్ర హింసలకు గురి చేశారు.Karnatakaలోని  nanjangud తాలుకాకు చెందిన  వివాహితకు కూలీ పనులకు వెళ్తున్న సమయంలో Vishnu అనే యువకుడితో Exrtra marital affair సంబంధం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయాన్ని వివాహిత భర్త గుర్తించాడు. వీరిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భర్త భావించాడు.ఇందుకుగాను అదను కోసం ఎదుదు చూస్తున్నాడు. మూడు రోజుల క్రితం విష్ణు  వివాహిత ఇంటికి వచ్చాడు.  ఈ సమయం కోసం వివాహిత Husband ఎదురు చూస్తున్నాడు విష్ణు రాగానే బయటి నుండి ఇంటి తలుపులు మూసేశాడు.  ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. స్థానికులంతా కలిసి విష్ణుతో పాటు వివాహితను బయటకు తీసుకొచ్చారు.

విద్యుత్ స్థంభానికి ఇద్దరిని కట్టేశారు. మూడు రోజుల పాటు  వీరిద్దరికి అన్న పానీయాలు ఇవ్వలేదు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి Social Mediaలో పోస్టు చేశారు. దీంతో పోలీసుల దృష్టికి వచ్చింది. Police వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను విడిపించారు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఈ కేసులో వివాహిత భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహిత మరిదితో పాటు కొందరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Jio Recharge Plans : కేవలం రూ.11 కే 10GB,రూ.49 కే 25GB హైస్పీడ్ డేటా
Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu