ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే నిన్న ఒక్క రోజే వెయ్యికి పైగా కేసులు పెరిగాయి. నిన్న ఒక్క రోజు దేశంలో 15,823 కేసులు రికార్డయ్యాయి.దీంతో మొత్తం కేసులు 3,40,01,743కి చేరుకొన్నాయి.
న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 15,823 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసులు 3,40,01,743కి చేరుకొన్నాయి. నిన్న ఒక్క రోజే coronaతో 226 మంది మరణించారు.అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇండియాలో కరోనా కేసులు పెరిగాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 3.40 కోట్లకు చేరుకొన్నాయి. మంగళవారం నాడు 13,26,399 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తే 15,823 మందికి కరోనా సోకిందని తేలింది.
also read:ఇండియాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు: మొత్తం 3,39,85,920కి చేరిక
గత 24 గంటల్లో Indiaలో 22,844 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 3.33 కోట్లకు చేరుకొంది. కరోనా రోగుల రికవరీ రేటు 98.06 శాతంగా నమోదైందని icmr ప్రకటించింది.
ఇండియాలో కరోనాతో ఇప్పటివరకు 4,51,189 మంది మరణించారు.కరోనాతో మృతుల సంఖ్య 1.38 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 2,07,653కి చేరాయి.
ఇక ఇండియాలో నమోదౌతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే రికార్డు అవుతున్నాయి. గత 24 గంటల్లో కేరళలో 7,823 కొత్త కేసులు నమోదయ్యాయి. 106 మంది కరోనాతో మరణించారు.మరోవైపు గత 24 గంటల్లో 50,63,845 మంది corona vaccine తీసుకొన్నారు. ఇప్పటివరకు 96,43,79,212 మంది వ్యాక్సినేషన్ చేయించుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.మరో వైపు అండమాన్ లో ఒక్క కరోనా కేసు నమోదైంది. దీంతో ఇక్కడ కరోనా కేసులు 7,735కి చేరింది.
ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.
రెండేళ్ల నుండి 18 ఏళ్ల లోపు చిన్నారులకు కూడ వ్యాక్సిన్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.త్వరలోనే ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి రానుంది.ప్రస్తుతం పండుగల సీజన్ వచ్చింది. డిసెంబర్ వరకు పండుగలు రానున్నాయి. దీంతో ఈ సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖాధికారులు కోరారు.