Corona In India: భారత్‌లో కొనసాగుతున్న కరోనా కలకలం.. స్వల్పంగా తగ్గిన కొత్త కేసులు..

By Sumanth KanukulaFirst Published Jan 17, 2022, 9:28 AM IST
Highlights

భారత్‌లో కరోనా కలకలం కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,58,089 కరోనా కేసుల నమోదయ్యాయి. అయితే కిందటి రోజుతో (2,71,202) పోలిస్తే కరోనా కేసుల సంఖ్య  స్వల్పంగా తగ్గింది. 

భారత్‌లో కరోనా కలకలం కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,58,089 కరోనా కేసుల నమోదయ్యాయి. అయితే కిందటి రోజుతో (2,71,202) పోలిస్తే కరోనా కేసుల సంఖ్య  స్వల్పంగా తగ్గింది. తాజాగా 385 కరోనాతో మంది మరణించారు. దీంతో కరోనాతో మొత్తం మరణాల సంఖ్య 4,86,451కి చేరింది. నిన్న కరోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 3,52,37,461కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,56,341 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు.. 14.41 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు.. 94.27 శాతం, యాక్టివ్ కేసులు.. 4.43 శాతంగా ఉంది. ఇక, శనివారం (జనవరి 15) రోజున దేశంలో 13,13,444 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 70,37,62,282కి చేరినట్టుగా తెలిపింది. 

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 39,46,348 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,57,20,41,825కి చేరింది. 

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ఇప్పటివరకు దేశంలో 8,209 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా తెలిపింది. 

మరోవైపు అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో తాజాగా 41,327 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది కిందటి రోజుతో పోలిస్తే 1,135 తక్కువ. ఇక, మహారాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 72,11,810కి చేరింది.  కరోనాతో తాజాగా 29 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,41,808కి చేరింది. నిన్న కరోనా నుంచి 40,386 మంది కోలుకున్నారు. దీంతో మహారాష్ట్రలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 68,00,900కి చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 2,65,346 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 

click me!