దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారామైన పద్మ విభూషణ్ ని ఆయన అందుకున్నారు. కాగా.. ఆయనను శిష్యులు.. అభిమానంతో పండిట్ జీ లేదా.. మహారాజ్ జీ అని పిలిచేవారు
లెజెండరీ కథక్ డాన్సర్ పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూశారు. ఆదివారం రాత్రి ఆయన గుండెపోటుతో మరణించారు. ప్రముఖ కథక్ డాన్సర్ అయిన పండిట్ బిర్జు మహారాజ్ ఢిల్లీలోని తన స్వగృహంలో కన్నుమూశారని అతని శిష్యులు చెప్పారు.భారతదేశ ప్రసిద్ధ కళాకారుల్లో ఒకరైన బిర్జు మహారాజ్ కు అతని శిష్యులు పండిట్ జీ, మహారాజ్ జీ అని ముద్దుగా పిలిచే వారు. బిర్జు మహారాజ్ వయసు 83 సంవత్సరాలు. పండిట్ బిర్జు మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
కాగా.. దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారామైన పద్మ విభూషణ్ ని ఆయన అందుకున్నారు. కాగా.. ఆయనను శిష్యులు.. అభిమానంతో పండిట్ జీ లేదా.. మహారాజ్ జీ అని పిలిచేవారు. కాగా.. భారత దేశంలోని అత్యుత్తమ కళాకారుల్లో ఆయన ఒకరు కావడం గమనార్హం.
ఆదివారం అర్థరాత్రి బిర్జూ మహారాజ్ తన మనవళ్లతో ఆడుకుంటున్న సమయంలో అతని ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితికి చేరుకున్నారు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.
గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన కొద్ది రోజుల క్రితం డయాలసిస్ చేయించుకున్నారు.
బిర్జు మహారాజ్ కథక్ నృత్యకారుల మహారాజ్ కుటుంబానికి చెందినవారు,అతని ఇద్దరు మేనమామలు, శంభు మహారాజ్ , లచ్చు మహారాజ్ , అతని తండ్రి అచ్చన్ మహారాజ్ లు కూడా నృత్యకారులుగా పేరొందారు.
కథక్ లెజెండ్ గా పేరొందిన బిర్జూ మహారాజ్.. డ్రమ్స్ కూడా బాగా వాయించగలరు. ఆయనకు అందులోనూ ప్రావీణ్యం ఉంది.