ఈ బీఎస్ఎఫ్ అధికారి సంపద చూస్తే కళ్లు తిరగాల్సిందే.. లగ్జరీకార్లు, కోట్ల నగదు, ఆభరణాలు.. రూ.125 కోట్ల మోసంతో...

Published : Jan 17, 2022, 08:20 AM IST
ఈ బీఎస్ఎఫ్ అధికారి సంపద చూస్తే కళ్లు తిరగాల్సిందే.. లగ్జరీకార్లు, కోట్ల నగదు, ఆభరణాలు.. రూ.125 కోట్ల మోసంతో...

సారాంశం

ఈ బీఎస్ఎఫ్ అధికారి వద్దనుంచి రూ.14 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గుర్గావ్ పోలీసులు అధికారి భార్య మమతా యాదవ్, సోదరి రీతూ, ఆమె సహచరుడిని కూడా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి BMW, జీప్, మెర్సిడెస్‌తో సహా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. NSG క్యాంపస్‌లో నిర్మాణ కాంట్రాక్టులు ఇప్పిస్తానని ఐపీఎస్ అధికారిగా నటిస్తూ, ప్రజల నుంచి కోట్లాది రూపాయలను యాదవ్ తీసుకున్నాడు. 

గుర్గావ్ : Haryanaలో ఓ బీఎస్ఎఫ్ అధికారి వద్ద బయటపడిన ఆదాయానికి మించిన ఆస్తులు అందరన్నీ షాక్ కు గురిచేశాయి. NSGBSF ఆఫీసర్ గా పనిచేస్తున్న ఇతను ప్రజల్ని మోసం చేయడం ద్వారా ఈ Assets కూడబెట్టినట్టు సమాచారం. అతని వద్ద నుంచి రూ. 14 కోట్ల నగదు, కోటి రూపాయల విలువైన ఆభరణాలు, BMW, Jeep Mercedesతో సహా ఏడు లగ్జరీ కార్లు  స్వాధీనం చేసుకున్నారు. 

హర్యానాలోని సరిహద్దు భద్రతా దళ అధికారి వద్దనుంచి ఈ immense wealthను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి గుర్గావ్ జిల్లాలోని మనేసర్‌లోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ హెడ్‌క్వార్టర్స్ (NSG)లో BSF డిప్యూటీ కమాండెంట్ గా నియమించబడ్డాడు. అతని పేరు ప్రవీణ్ యాదవ్. కాగా తాను ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్‌ అని చెప్పుకుంటూ ప్రజలదగ్గరి నుంచి వివిధ పేర్లతో రూ.125 కోట్ల మోసం చేశాడు. ఇతడి మీద ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేయగా, సోదాల్లో ఈ ఆస్తులు బయటపడ్డాయి. 

ఇప్పుడు అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ బీఎస్ఎఫ్ అధికారి వద్దనుంచి రూ.14 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గుర్గావ్ పోలీసులు అధికారి భార్య మమతా యాదవ్, సోదరి రీతూ, ఆమె సహచరుడిని కూడా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి BMW, జీప్, మెర్సిడెస్‌తో సహా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు.

NSG క్యాంపస్‌లో నిర్మాణ కాంట్రాక్టులు ఇప్పిస్తానని ఐపీఎస్ అధికారిగా నటిస్తూ, ప్రజల నుంచి కోట్లాది రూపాయలను యాదవ్ తీసుకున్నాడు. మోసం చేసిన మొత్తం డబ్బును అతడు ఎన్‌ఎస్‌జీ పేరుతో నకిలీ ఖాతాకు బదిలీ చేశాడు. యాక్సిస్ బ్యాంక్‌లో మేనేజర్‌గా ఉన్న అతని సోదరి రీతూ యాదవ్ ఈ ఖాతాలను తెరవడంలో సహాయం చేసినట్లు పోలీసులు తెలిపారు.

"ప్రవీణ్ యాదవ్ స్టాక్ మార్కెట్‌లో రూ. 60 లక్షలు నష్టపోయాడు. ఆ తరువాతే ఈ మోసాలకు తెరలేపాడు. తాను నష్టపోయిన సొమ్మును సంపాదించే క్రమంలో ప్రజల్ని మోసం చేయాలనే ప్లాన్ వేశాడు. తాను ఎవరికీ పట్టుబడకుండా పకడ్బందీగా ప్లాన్ వేశాడు’ అని గుర్గావ్ పోలీస్ క్రైమ్ ACP ప్రీత్ పాల్ సింగ్ తెలిపారు.

పోలీసుల ప్రకారం, ప్రవీణ్ యాదవ్ కు ఇటీవల అగర్తలలో పోస్టింగ్ వచ్చింది. అయితే అప్పటికే జనాల్ని మోసం చేయడం ద్వారా చాలా డబ్బు కూడబెట్టడంతో.. కొద్ది రోజుల క్రితం, ఆ పదవికి అతను రాజీనామా చేశాడు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !