తొలగని కోవిడ్ పీడ.. 97 రోజుల తర్వాత భారత్‌లో కొత్తగా 300 కేసులు

Siva Kodati |  
Published : Mar 04, 2023, 04:00 PM IST
తొలగని కోవిడ్ పీడ.. 97 రోజుల తర్వాత భారత్‌లో కొత్తగా 300 కేసులు

సారాంశం

చాలా రోజుల తర్వాత మనదేశంలో 300 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 97 రోజుల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటితో కలిపి ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 2,686కి చేరుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 

మూడేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తూనే వుంది. మనిషిని నాలుగు గోడల మధ్య బంధించి, ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కోవిడ్ రక్కసి పీడ విరగడ అయ్యిందనే లోపు.. మరొసారి కొత్త వేరియంట్ల రూపంలో ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే చైనాలో కరోనా మరణ మృదంగాన్ని మోగిస్తున్న సంగతి తెలిసిందే. మనదేశంలో కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టడంతో భారత్‌లో కరోనా నియంత్రణలోకి వచ్చింది. తాజాగా చాలా రోజుల తర్వాత మనదేశంలో 300 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 97 రోజుల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటితో కలిపి ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 2,686కి చేరుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 

ALso REad: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త దారుణ హత్య.. అధికారులు ఏమంటున్నారు?

దేశంలో ఒకే రోజు 334 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా మూడు మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు భారతదేశంలో మరణాల సంఖ్య 5,30,775కి చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో ఇద్దరు కోవిడ్‌తో ప్రాణాలు  కోల్పోగా.. కేరళలో ఒకరు చనిపోయారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కోవిడ్ రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,54,035కి చేరుకుంది. అయితే మరణాల రేటు మాత్రం 1.19 శాతంగా నమోదైంది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశవ్యాప్తంగా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు 220.63 కోట్ల మందికి కరోనా టీకాలు అందించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!