India Pakistan War: మన సైనికులను చూస్తే గర్వంగా ఉంది: నీరజ్ చోప్రా

Published : May 09, 2025, 02:21 AM IST
India Pakistan War: మన సైనికులను చూస్తే గర్వంగా ఉంది: నీరజ్ చోప్రా

సారాంశం

India Pakistan War: భారత సైన్యానికి ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా మద్దతు ప్రకటించారు. ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని పిలుపునిచ్చారు. మన సైనికులను పోరాటం చూస్తే గర్వంగా ఉందని తెలిపారు. 

India Pakistan War: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఒలింపిక్ హీరో నీరజ్ చోప్రా భారత సాయుధ దళాలకు తన మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న సైనికుల ధైర్యం, నిబద్ధతను ప్రశంసిస్తూ, దేశ పౌరులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలంటూ విజ్ఞప్తి చేశారు.

రెండు సార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచిన నీరజ్ చోప్రా.. తన అధికారిక X (Twitter) ఖాతా ద్వారా స్పందిస్తూ.. "ఉగ్రవాదంతో పోరాడుతున్న మన ధైర్యవంతమైన భారత సాయుధ దళాలపై మాకు గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరూ భద్రతా మార్గదర్శకాలను పాటించి దేశాన్ని కాపాడటంలో భాగస్వాములవుదాం. జై హింద్, జై భారత్, జై హింద్" అని పేర్కొన్నారు.

నీరజ్ రాబోయే పోటీల షెడ్యూల్ మే 16న జరిగే దోహా డైమండ్ లీగ్‌తో ప్రారంభమవుతోంది. అలాగే మే 24న బెంగళూరులో జరగబోయే తొలి నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్‌లో ఆయన పాల్గొనలేరు. ఆయన గైర్హాజరుతో పురుషుల జావెలిన్ విభాగంలో సచిన్ యాదవ్, యశ్వీర్ సింగ్ భారత జెండాను ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఇక పాకిస్థాన్ నుంచి జమ్మూ ప్రాంతాల్లోని సత్వారీ, సంబా, ఆర్‌ఎస్ పురా, అర్నియాపై 8 క్షిపణులు ప్రయోగించబడ్డాయి. అయితే భారత వాయుసేనకు చెందిన వాయు రక్షణ వ్యవస్థలు ఈ క్షిపణులన్నింటినీ అడ్డుకున్నాయని రక్షణ వర్గాలు వెల్లడించాయి.

ఉధంపూర్ (జమ్మూ & కాశ్మీర్), జైసల్మేర్ (రాజస్థాన్) ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా గుర్తించి తిప్పికొట్టింది. ఆ ప్రాంతాల్లో పేలుళ్లు, ఆకాశంలో మెరుపులు కనిపించాయి. భద్రత కారణాల దృష్ట్యా బికనీర్ (రాజస్థాన్), జలంధర్ (పంజాబ్), కిష్త్వార్, అఖ్నూర్, సంబా, జమ్మూ, అమృత్‌సర్ సహా అనేక ప్రాంతాల్లో పూర్తిస్థాయి బ్లాక్‌అవుట్ అమలు చేశారు. 

ఇంతకుముందు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించి, పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన క్షిపణి దాడులు జరిపింది. దేశ రక్షణ స్థావరాలపై దాడి జరిగితే తగిన సమాధానం ఇస్తామని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, నీరజ్ చోప్రా వంటి ప్రముఖ క్రీడాకారులు తమ మద్దతు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా సైన్యానికి మద్దతు వెల్లువెత్తుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?