India Pakistan tension war: భారత-పాక్ ఉద్రిక్తతలు.. విమానాశ్రయాల్లో అల‌ర్ట్

Published : May 09, 2025, 02:11 AM IST
India Pakistan tension war: భారత-పాక్ ఉద్రిక్తతలు.. విమానాశ్రయాల్లో అల‌ర్ట్

సారాంశం

India Pakistan tension war: పాకిస్తాన్ క్షిపణి దాడులపై భారత్ స్పందనతో దేశవ్యాప్తంగా భద్రత పెంపుతో పాటు 24 విమానాశయాలు తాత్కాలికంగా మూసివేసింది. హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించింది.   

India Pakistan war: భారత-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాల్లో తాత్కాలికంగా మూసివేయాలని గురువారం ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్తాన్ భారత భూభాగంపై క్షిపణులు, డ్రోన్‌లతో దాడులు ప్రారంభించడంతో ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

భద్రతా చర్యల్లో భాగంగా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) వెంటనే టెర్మినల్ బిల్డింగ్‌లలో సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించింది. సందర్శకుల ప్రవేశ టికెట్ల అమ్మకాలు కూడా నిలిపివేయబడ్డాయి.

భారత పౌర విమానయాన భద్రతా సంస్థ (BCAS) దేశవ్యాప్తంగా అన్ని విమానాశయాల్లో 100 శాతం సెకండరీ ల్యాడర్ పాయింట్ చెక్ (SLPC) అమలును ఆదేశించింది. ఈ ఆదేశాలు, భారత్-పాక్ సరిహద్దు వద్ద చోటుచేసుకున్న భారీ ఉద్రిక్తతల దృష్ట్యా జారీయ్యాయి. ఈ పరిణామాల్లో భాగంగా మిస్సైల్ దాడులు, వైమానిక దాడులు, అనేక రాష్ట్రాల్లో విద్యుత్ అంతరాయం చోటుచేసుకున్నాయి.

పాకిస్తాన్ 15 భారత నగరాలపై లక్ష్యంగా చేసుకుని చేసిన దాడి ప్రయత్నం విఫలమవడంతో, వెంటనే జమ్మూ కశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పూరా, ఆర్నియా, సమ్బా, హీరానగర్ ప్రాంతాలపై తీవ్ర శెల్లింగ్ జరిగింది. ఇవన్నీ సైనిక పరంగా కీలకమైన ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. జమ్మూ నగరంపై కూడా ఎయిర్ స్ట్రైక్ ముప్పు నెలకొంది.

భారత వైమానిక రక్షణ బృందాలు వెంటనే స్పందించాయి. సరిహద్దు ప్రాంతాల్లోకి దూసుకొచ్చిన ఎనిమిది క్షిపణులను సమర్థంగా అడ్డుకున్నాయి. రాత్రి 9 గంటల సమయంలో జమ్మూలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. తర్వాత వెంటనే సైరన్లు మోగించబడ్డాయి, విద్యుత్ సేవలు నిలిపివేయబడ్డాయి.


ఈ ఉద్రిక్తతలు జమ్మూ వరకే పరిమితం కాలేదు. పంజాబ్‌లోని పఠాన్కోట్‌పై భారీ అర్టిల్లరీ దాడి జరిగింది. చండీగఢ్, ఫిరోజ్‌పూర్, మోహాలి, గురుదాస్‌పూర్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేయబడింది.

మూసివేసిన 24 విమానాశయాల జాబితా:

పంజాబ్: అమృత్‌సర్, లుధియానా, పాటియాలా, బఠింఢా, హల్వారా, పఠాన్కోట్
హిమాచల్ ప్రదేశ్: భున్తార్, శిమ్లా, కాంగ్రా-గగ్గల్
చండీగఢ్ (యూనియన్ టెర్రిటరీ): చండీగఢ్
జమ్మూ & కశ్మీర్: శ్రీనగర్, జమ్మూ
లడఖ్: లేహ్
రాజస్థాన్: కిషన్‌గఢ్, జైసల్మేర్, జోధ్‌పూర్, బికానెర్
గుజరాత్: ముండ్రా, జామ్‌నగర్, హిరాసర్, పోర్భందర్, కేశోద్, కాండ్లా, భుజ్

ప్రభుత్వం జారీ చేసిన నోటీస్ టు ఎయిర్‌మెన్ (NOTAM) ప్రకారం, ఈ విమానాశయాల మూతలు తాత్కాలికంగా ఉన్నప్పటికీ, పరిస్థితిని బట్టి మరింత పొడిగించే అవకాశం ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?