భారత్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 781కి చేరింది. మరోవైపు దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
భారత్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 781కి చేరింది. దేశంలోని మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు 241 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వివరాలను వెల్లడించింది. ఢిల్లీలో అత్యధికంగా 238 Omicron Cases నమోదు కాగా, 161 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది.
మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే.. గుజరాత్‌లో 73, కేరళలో 65, తెలంగాణలో 62, రాజస్తాన్‌లో 46, కర్ణాటకలో 34, తమిళనాడులో 34, హర్యానాలో 12, పశ్చిమ బెంగాల్‌లో 11, మధ్యప్రదేశ్‌లో 9, ఒడిశాలో 8, ఆంధ్రప్రదేశ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 4, చంఢీఘర్‌లో 3, జమ్మూ కశ్మీర్‌లో 3, ఉత్తరప్రదేశ్‌లో 2, గోవాలో 1, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లడఖ్‌లో 1, మణిపూర్‌లో 1 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
undefined
ఒమిక్రాన్‌తో కోలుకున్న వారి సంఖ్య విషయానికి వస్తే.. ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 72, గుజరాత్‌లో 17, కేరళలో 1, తెలంగాణలో 10, రాజస్తాన్‌లో 30, కర్ణాటకలో 18, తమిళనాడులో 16, హర్యానాలో 2, పశ్చిమ బెంగాల్‌లో 1, మధ్యప్రదేశ్‌లో 7, ఒడిశాలో 0, ఆంధ్రప్రదేశ్‌లో 1, ఉత్తరాఖండ్‌లో 0, చంఢీఘర్‌లో 2, జమ్మూ కశ్మీర్‌లో 3, ఉత్తరప్రదేశ్‌లో 2, గోవాలో 0, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లడఖ్‌లో 1, మణిపూర్‌లో 0గా ఉంది.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..
మరోవైపు దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,195 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,48,08,886కి చేరింది. నిన్న కరోనాతో 302 మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,80,592కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 7,347 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,42,51,292కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 77,002 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. దేశంలో నిన్న 64,61,321 డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,43,15,35,641కు చేరింది.