కొడుకుతో కలిసి భర్తను దారుణంగా హతమార్చిన భార్య.. పది రోజులుగా శవాన్ని ఇంట్లోనే దాచి, పరార్..

By SumaBala BukkaFirst Published Dec 29, 2021, 9:44 AM IST
Highlights

కమలేష్ ను అతని భార్య సునీత హత్య చేసి ఉంటుందని కమలేష్ సోదరుడు రామ్ కిషన్ పోలీసులకు చెప్పాడు.  సునీత ఫోన్ నెంబర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు ఆమెను పట్టుకున్నారు.  సునీత ను పోలీసులు విచారణ పేరుతో చిత్రహింసలు పెడతారన్న భయంతో  ఆమె కుమారుడు ఆదర్శ్  పోలీసులకు నిజం చెప్పాడు.  

ఉత్తరప్రదేశ్ : తన సోదరుడు పది రోజులుగా కనబడడం లేదని ఒక వ్యక్తి పోలీసులకు Complaint చేశాడు పోలీసులు అతని ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. తాళం పగులగొట్టి చూస్తే.. అక్కడ ఆ వ్యక్తి dead body కనబడింది. ఈ ఘటన uttar pradesh రాష్ట్రంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే…  ఉత్తరప్రదేశ్లోని బాగా పూర్ గ్రామానికి చెందిన కమలేష్ నలబై అనే వ్యక్తి కనబడటం లేదంటూ అతని సోదరుడు రామ్ కిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు ఇంటికి  వెళ్లి చూస్తే Lock వేసి ఉంది. కమలేష్ భార్య సునీత, కుమారుడు ఆదర్శ్ ఎక్కడికి వెళ్లారు ఎవరికీ తెలియదు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు తాళం పగులగొట్టి లోపలికి వెళ్ళి చూశారు. అక్కడ  వారికి కమలేష్ శవం దొరికింది.

కమలేష్ ను అతని భార్య సునీత murder చేసి ఉంటుందని కమలేష్ సోదరుడు రామ్ కిషన్ పోలీసులకు చెప్పాడు.  సునీత ఫోన్ నెంబర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు ఆమెను పట్టుకున్నారు.  సునీత ను పోలీసులు విచారణ పేరుతో Torture పెడతారన్న భయంతో  ఆమె కుమారుడు ఆదర్శ్  పోలీసులకు నిజం చెప్పాడు.  తన తండ్రి కమలేష్ తాగుబోతు అని… రోజు ఇంటికి తాగి వచ్చి తనని,  తన తల్లిని చితకబాదేవాడని ఆదర్శ చెప్పాడు.

ఒకరోజు తల్లి కొడుకులు కలిసి కమలేష్ ని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు హత్య చేశాక శవాన్ని ఏం చేయాలో తెలియక ఇంట్లోనే పెట్టి.. తాము పారిపోయామని ఆదర్శ్ పోలీసులకు తెలిపాడు.  పోలీసులు  సునీత,  ఆమె కుమారుడు ఆదర్శ్ ల మీద హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య.. కత్తులతో పొడిచి చంపిన రెండో భర్త..

ఇదిలా ఉండగా, కర్ణాటక, ఐటీ సిటీలో murder culture పెరిగిపోతోంది. స్నేహితులు, భార్యభర్తలు, ప్రేమికులు సైతం పరస్పరం హత్యలకు తెగబడడం ఆందోళన కలిగిస్తోంది. Bangalore ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసూరు రోడ్డు జంక్షన్ వద్ద సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో అర్చనా రెడ్డి (38) అనే మహిళను ఆమె Second husband నవీన్ కుమార్, మరో ఇద్దిరితో కలిసి కత్తులతో నరికి చంపాడు. 

వివరాల్లోకి వెడితే.. ఆనేకల్ జిగణికి చెందిన అర్చనకు మొదట పెళ్లయి ఒక కొడుకు ఉన్నాడు. భర్తతో గొడవలు వచ్చి విడిపోయి, తరువాత నవీన్ కుమార్ ను రెండో పెళ్లి చేసుకుంది. ఆస్తుల విషయంలో అతనితోనూ గొడవలు వచ్చి బెళ్లందూరులో విడిగా జీవిస్తోంది. పురసభ ఎన్నికల్లో ఓటు వేసి కారు డ్రైవర్, కొడుకుతో కలిసి కారులో వస్తోంది. 

అప్పటికే అక్కడ కాపు కాసిన నవీన్ కుమార్, అనుచరులు కారును హోసూరు రోడ్డు జంక్షన్ వద్ద అటకాయించి దాడి చేశారు. ఆమె కుమారుడు, డ్రైవర్ పరారయ్యారు. కారులో ఉన్న అర్చనా రెడ్డిని ముగ్గురు కలిసి దారుణంగా నరికి హత్య చేసి వెళ్లి పోయారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు పరిశీలించి ఆమె కుమారుడు, డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!