India Pakistan War : పాకిస్తాన్ కు IMF లోన్.. నిర్ణయాత్మక ఓటింగ్ కు ఇండియా దూరమెందుకుంది?

పాకిస్తాన్ కు IMF లోన్ ఇవ్వడం పై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి సహాయం చేసే దేశానికి డబ్బు ఇస్తే అంతర్జాతీయ సంస్థల పరువు పోతుందని అన్నారు. ఇలా అభ్యంతరం తెలిపిన ఇండియా ఓటింగ్ కు ఎందుకు దూరమయ్యిందో తెలుసా? 

Google News Follow Us

India Pakistan War : పాకిస్తాన్ కి ఐఎంఎఫ్ (International Monetary Fund) లోన్ ఇవ్వడం పై ఇండియా తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఉగ్రవాదానికి సహకరించే దేశానికి డబ్బు ఇస్తే అంతర్జాతీయ సంస్థల పరువు పోతుందని హెచ్చరించింది. ఇలా పాక్ కు డబ్బులు ఇవ్వొద్దని ఇంత గట్టిగా చెప్పిన భారత్ IMF ఓటింగ్ కు ఎందుకు గైర్హాజకయ్యిందో ఇక్కడ తెలుసుకుందాం.

IMF మీటింగ్ లో ఇండియా అభ్యంతరం

పాకిస్తాన్ కి $1 బిలియన్ Extended Fund Facility (EFF), $1.3 బిలియన్ Resilience and Sustainability Facility (RSF) ఇవ్వడం పై IMF సమీక్ష చేసింది. ఈ సమయంలో ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ ఈ వ్యవహారంపై IMF రూల్స్ ప్రకారం ఇండియా వ్యతిరేకంగా ఓటు వేయలేకపోయింది. అందుకే భారత్ ఓటింగ్ కు దూరంగా ఉంది. కానీ తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని గట్టిగానే చెప్పింది భారత్. 

ఇండియా అభ్యంతరాలు

  1. 28 సార్లు సాయం... అయినా పాక్ మారలేదు : గత 35 ఏళ్లలో 28 సార్లు IMF సాయం తీసుకున్నా పాకిస్తాన్ తన తీరు మార్చుకోలేదు.. ఇలా సాయం పొందిన డబ్బులతో ఉగ్రవాదులకోసం ఖర్చు చేస్తోందని ఇండియా ఆరోపించింది.
  2. ఆర్థిక వ్యవహారాల్లో సైన్యం జోక్యం: పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల్లో సైన్యం జోక్యం చేసుకుంటోందని... దానివల్ల పారదర్శకత, ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని IMF కి ఇండియా తెలిపింది. 
  3. ఉగ్రవాదానికి IMF డబ్బులు: IMF ఇచ్చే డబ్బు ఉగ్రవాదానికి వాడే ప్రమాదం ఉందని ఇండియా హెచ్చరించింది.

2021 UN రిపోర్ట్ ప్రస్తావన

పాకిస్తాన్ సైన్యమే ఆ దేశంలో అతిపెద్ద కార్పొరేట్ సంస్థ అని 2021 UN రిపోర్ట్ చెప్పిందని ఇండియా గుర్తు చేసింది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ సైన్యం Special Investment Facilitation Council ని నడుపుతోందని గుర్తుచేసారు. కాబట్టి IMF కేవలం నియమాలకే పరిమితం కాకుండా నైతిక విలువలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఇండియా సూచించింది.

IMF ఓటింగ్ లో లోపాలు

IMF లో 25 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారు. కానీ UN లాగా ఒక దేశానికి ఒక ఓటు ఉండదు. అమెరికా వంటి పెద్ద దేశాలకు ఎక్కువ ఓటింగ్ పవర్ ఉంటుంది. మిగతా దేశాలకు ఓటింగ్ లో సపోర్ట్ లేదా గైర్హాజరు మాత్రమే ఉంటాయి... వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం లేదు. అందుకే ఇండియా ఈసారి గైర్హాజరై తన అభ్యంతరం నమోదు చేసింది.

Read more Articles on