గుడ్‌న్యూస్: 18‌ ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్, కోవాగ్జిన్‌కి గ్రీన్‌సిగ్నల్

Published : Oct 12, 2021, 01:29 PM ISTUpdated : Oct 12, 2021, 01:51 PM IST
గుడ్‌న్యూస్: 18‌ ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్, కోవాగ్జిన్‌కి   గ్రీన్‌సిగ్నల్

సారాంశం

రెండేళ్ల నుండి 18 ఏళ్లలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.,  మూడు వయస్సుల వారికి  వ్యాక్సిన్ అందించారు.

న్యూఢిల్లీ: త్వరలోనే  2-18 ఏళ్లలోపు పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన covaxin కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ అందించింది.కోవాగ్జిన్ corona vaccine ను  చిన్న పిల్లలకు అత్యవసర వినియోగం కింద అందించేందుకు నిపుణుల కమిటీ మంగళవారం నాడు అనుమతిని ఇచ్చింది.

also read:ఆ రోజు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే...బహుమతులు గెలుచుకోవచ్చు..!

కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను మూడు రకాల వయస్సు పిల్లలపై ప్రయోగించారు. 12 -18 ఏళ్లు, 6-12 ఏళ్లు, 2-6 ఏళ్ల మధ్య పిల్లలపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించారు.తొలుత 12-18 ఏళ్ల  పిల్లలపై ఈ వ్యాక్సిన్ ను పరిశీలించారు.

ఆ తర్వాత ఇతర వయస్సు పిల్లలపై ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయమై ప్రయోగాలు చేసినట్టుగా ఎయిమ్స్ ప్రోఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ చెప్పారు.ఈ వ్యాక్సిన్ తీసుకొన్న పిల్లల్లో తేలికపాటి ఇన్‌ఫెక్షన్లు మాత్రమే ఉన్నాయని గుర్తించామని వైద్య నిపుణులు చెప్పారు.. జలుబు, స్వల్పమైన తలనొప్పిని మాత్రమే గుర్తించామన్నారు..ఈ వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఇంకా ఆమోదం లభించలేదు. దీనికి త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో చిన్నారులపై కోవాగ్జిన్  టీకా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేశారు. ఈ ఫలితాలను భారత్ బయోటెక్ సంస్థ dcgi కి పంపింది. సుమారు 525 మంది చిన్నారులపై రెండు, మూడు దశల్లో ప్రయోగాలు నిర్వహించారు.

హైద్రాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఈ వ్యాక్సిన్ ను తయారు చేసింది.  కోవాగ్జిన్ చిన్న పిల్లల టీకాపై భారత్ బయోటెక్ సంస్థ పంపిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను పరిశీలించిన  డీసీజీఐ బృందం ఇవాళ ఈ టీకాను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతిని ఇచ్చింది.

aefi, aesi కి చెందిన డేటాతో పాటు భద్రతా డేటాను కూడ సమర్పించాలని కోవాగ్జిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ ఫార్మా సంస్థను డీసీజీఐ ఆదేశించింది. తొలి రెండు నెలల్లో ప్రతి 15 రోజులకు ఓసారి ఎనాలసిస్ ను పంపాలని కూడ కోరింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లను భారత్ బయోటెక్ సంస్థ సమర్పించింది.ఈ ఏడాది ఆగష్టులో 12 -18 ఏళ్ల వయస్సునన్న పిల్లలకు జైకోవ్ -డి వ్యాక్సిన్ ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు డీసీజీఐ అనుమతిచ్చింది. ఈటీకాను జైడస్ సంస్థ తయారు చేసింది. ప్రపంచంలోనే డీఎన్ఏ వ్యాక్సిన్ గా ఇది పేరొందింది.


 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu