మానవ హక్కుల కోసం భారత ప్రభుత్వం కట్టుబడి ఉన్నది: ప్రధానమంత్రి మోడీ

By telugu teamFirst Published Oct 12, 2021, 1:15 PM IST
Highlights

భారత ప్రభుత్వం దేశ పౌరుల మానవ హక్కుల కోసం కట్టుబడి ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ 28వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఆన్‌లైన్‌లో పాల్గొని ప్రసంగించారు. 
 

న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ 28వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి narendra modi మాట్లాడారు. భారత దేశ పౌరుల మానవ హక్కుల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రధాని మోడీ ఈ సమావేశంలో అన్నారు. మానవ హక్కులకు సంబంధించి మరో కోణం ఒకటి ఉన్నదని, దాని గురించి ఇవాళ మాట్లాడాలని భావిస్తున్నట్టు ఆన్‌లైన్‌లో పాల్గొన్న pm చెప్పారు. ఈ మధ్య కాలంలో కొందరు తమకు తోచిన మార్గంలో human rightsను చర్చిస్తున్నారని తెలిపారు. వారి వారి ప్రయోజనాలకు అనుగుణంగా హక్కుల గురించి మాట్లాడుతున్నారని వివరించారు.

కొందరు ఓ ఘటనలో మానవ హక్కులు ఉల్లంఘించబడ్డాయని అంటారని, అలాంటి తరహాలోనే మరో ఘటన ఇంకో చోట జరిగితే దానిపై నోరు మెదపరు అని ప్రధాని మోడీ అన్నారు. ఇలాంటి మెంటాలిటీతోనే మానవ హక్కులకు తీరని నష్టం జరుగుతున్నదని తెలిపారు. మహిళలకు పనిచేయడానికి నేడు అనేక రంగాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వారికి భద్రత కల్పించి 24 గంటలూ పని కల్పించే ఆలోచన చేస్తున్నట్టు వివరించారు. పనిచేస్తున్న womenకు 26 వారాల మెటర్నిటీ సెలవులు మనదేశంలో అందుబాటులో ఉన్నాయని, పెద్ద పెద్ద దేశాల్లోనూ ఈ సదుపాయం లేదని పేర్కొన్నారు.

Also Read: ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మిక తనిఖీ.. నూతన పార్లమెంటు నిర్మాణ పనుల పరిశీలన.. వీడియో ఇదే

గత కొన్నేళ్లుగా భారత దేశం పలు స్థాయిల్లో పలువిధాల్లో సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నదని ప్రధాని తెలిపారు. దశాబ్దాలుగా ముస్లిం మహిళలు త్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. త్రిపుల్ తలాఖ్‌కు  వ్యతిరేకంగా చట్టాన్ని తెచ్చి వారికి సరికొత్త హక్కులను కల్పించామని వివరించారు.

సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే నినాదంతో దేశం ముందుకు వెళ్తున్నదని నరేంద్ర మోడీ వివరించారు. ప్రభుత్వం ప్రారంభించిన ఓ పథకం అన్ని వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చకపోతే అప్పుడూ హక్కుల సమస్య తలెత్తుతుందని తెలిపారు.

click me!