ఇదీ పాకిస్తాన్ అసలురూపం.. ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలా!

Published : May 08, 2025, 09:19 PM IST
ఇదీ పాకిస్తాన్ అసలురూపం.. ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలా!

సారాంశం

ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడారు.ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధాలను ఆయన మరోసారి బయటపెట్టారు.  

భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్ సంబంధాలను బయటపెట్టారు. గురువారం ఢిల్లీలో ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాత పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు సైనిక ఉన్నతాధికారుల సమక్షంలో పాక్ అధికారిక అంత్యక్రియలు నిర్వహించడాన్ని తప్పుబట్టారు... ఇలా పాకిస్థాన్ నిజస్వరూపాన్ని ప్రపంచం ముందుంచారు మిస్రీ. 

“పాకిస్తాన్ జెండాలతో కప్పబడిన శవపేటికలతో, అధికారిక గౌరవాలతో ఉగ్రవాదుల అంత్యక్రియలు జరగడం కూడా వింతగా ఉంది. ఇండియా ఆర్మీ కేవలం ఉగ్రవాద స్ధావరాలనే టార్గెట్ గా చేసుకుని దాడులకు దిగింది... సామాన్య పౌరులెవరూ ఈ దాడిలో మరణించలేదు. అయితే ఉగ్రవాదులకు అధికారిక అంత్యక్రియలు చేయడం పాకిస్తాన్‌లో ఒక ఆచారం కావచ్చు. ఇది మాకు అర్థం కావడం లేదు” అంటూ మిస్రీ ఎద్దేవా చేసారు. 

 

భారత క్షిపణి దాడుల్లో మరణించిన వారికి అంత్యక్రియల ప్రార్థనలు చేస్తున్న హఫీజ్ అబ్దుల్ రౌఫ్, అమెరికా గుర్తించిన ప్రపంచ ఉగ్రవాది, లష్కరే తోయిబా అధిపతి ఫోటోను మిశ్రీ చూపించారు.

హఫీజ్ అబ్దుల్ రౌఫ్, అమెరికా గుర్తించిన ప్రపంచ ఉగ్రవాది, లష్కరే తోయిబా అధిపతి, భారత క్షిపణి దాడుల్లో మరణించిన వారికి అంత్యక్రియల ప్రార్థనలు చేస్తున్నారు. 2008 ముంబై ఉగ్రదాడితో సహా లష్కరే తోయిబా కార్యకలాపాలకు రౌఫ్ సహాయం చేశారు. లష్కరే తోయిబా ఆర్థిక, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లలో ఆయన పాత్రకు 2010లో అమెరికా ఆర్థిక శాఖ రౌఫ్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించింది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు