ఇదెక్కడి ఎయిర్ డిఫెన్స్ సిస్టంరా బాబు... చైనా సరుకును నమ్ముకుంటే పాక్ కు ఇలాంటి షాకులే

Published : May 08, 2025, 09:05 PM IST
ఇదెక్కడి ఎయిర్ డిఫెన్స్ సిస్టంరా బాబు... చైనా సరుకును నమ్ముకుంటే పాక్ కు ఇలాంటి షాకులే

సారాంశం

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉన్న చైనా తయారీ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత సైన్యం డ్రోన్ దాడితో ధ్వంసం చేసింది. దీంతో చైనా ఆయుధాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Operation Sindoor: భారతదేశంలోని 15 నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నానికి భారత సైన్యం తిప్పికొట్టింది. భారత్ వైపు దూసుకొస్తున్న పాక్ మిస్సైల్స్ ని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో నాశనం చేసారు. దీనికి ప్రతిగా మే 8 ఉదయం భారత సైన్యం పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉన్న చైనా తయారీ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది.

పాకిస్తాన్‌కు దెబ్బ, చైనాకు అవమానం

భారత సైన్యం లాహోర్‌లోని చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్‌ను డ్రోన్ సాయంతో ధ్వంసం చేసింది. అప్పటి నుంచి పాకిస్తాన్‌లోని చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత వైమానిక దళం నుంచి రక్షణ కోసం పాకిస్తాన్ చైనా నుంచి HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను తీసుకుంది. కానీ చైనా వస్తువుల నాణ్యత మరోసారి విఫలమైంది. భారత్ డ్రోన్ దాడితో పాకిస్తాన్‌కు దెబ్బ కొట్టినా, చైనాకు కూడా గుణపాఠం చెప్పింది.

చైనా వస్తువులపై నమ్మకం పాకిస్తాన్‌కు ఖరీదైందా?

చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 ధ్వంసం కావడం చిన్న విషయం కాదు.. ఆ దేశ వస్తువులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో చైనా ఆయుధాలపై ప్రపంచ దేశాలకు నమ్మకం తగ్గుతుంది... పాకిస్తాన్ వ్యూహాత్మకంగా ఓడిపోయింది. HQ-9 అనేది చైనా ప్రధాన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీన్ని అమెరికా పేట్రియాట్, రష్యా S-300 సిస్టమ్‌లను కాపీ కొట్టి తయారు చేశారు.

పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం

చైనా తయారీ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరిధి 120–250 కి.మీ. ఇది AESA రాడార్, మల్టీ-టార్గెట్ ఎంగేజ్‌మెంట్‌ను గుర్తించి నాశనం చేయగలదని చైనా పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంది. కానీ పాకిస్తాన్ నగరాలను రక్షించుకోలేకపోవడంతో దాని నిజస్వరూపం బయటపడింది. పాకిస్తాన్ దీన్ని తన ప్రధాన నగరాలైన కరాచీ, లాహోర్, రావల్పిండి, గ్వాదర్ వంటి ప్రాంతాల్లో మోహరించింది. కానీ భారత్ దాన్ని క్షణాల్లో ధ్వంసం చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu