కరోనావైరస్: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం

Published : Mar 14, 2020, 05:54 PM IST
కరోనావైరస్: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం

సారాంశం

కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నోటిఫైడ్ డిజాస్టర్ గా ప్రకటించింది. విపత్తు కింద ఎస్డీఆర్ఎఫ్ నుంచి ఎలా నిధులు వాడుకోవచ్చునో తెలియజేసింది.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ ను విపత్తుగా ప్రకటించింది. నోటిఫైడ్ డిజాస్టర్ గా ప్రకటించింది. వైరస్ వల్ల మరణించినవారి కటుుంబ సభ్యులకు నష్టపరిహారం, కరోనావైరస్ సోకిన వ్యక్తులకు సహాయం అందించడం దీనివల్ల వీలవుతుంది. 

రాష్ట్రాల డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ (ఎస్డీఆర్ఎఫ్) నుంచి నిధులను, ఇతర చర్యలను పొందడానికి వీలు కల్పిస్తుంది. కరోనావైరస్ పై ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర మంత్రిత్వ శాఖ మీడియాకు వెల్లడించిన నేపథ్యంలో ఆ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. 

Also Read: తిరుమల వెంకన్న ను కూడా తాకిన కరోనా

కరోనావైరస్ లేదా కోవిడ్ 19వల్ల మరణించినవారి కుటుంబాలకు రూ.4 లక్షలేసి నష్టపరిహారం అందుతుందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. దానికితోడు, కరోనావైరస్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడానికి అవసరమైన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి.

క్వారంటైన్ శిబిరాల్లో ఉండేవారికి తాత్కాలిక ఆశ్రయం కల్పించడానికి, ఆహారం, మంచినీరు, దుస్తులు, మెడికల్ కేర్ సరఫరా వంటివాటి అందిస్తోంది. ఈ వివరాలను ప్రభుత్వం తీసుకునే చర్యల్లో వివరించింది.

Also read: కేవలం కరోనా వల్లే కాదు... హైదరబాద్ లో కర్ణాటక వాసి మృతిపై కేంద్ర మంత్రి

ఎస్డీఆర్ఎఫ్ నిధులను అదనపు పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు, పోలీసులకు రక్షణ పరికరాల కల్పనకు, హెల్త్ కేర్, మున్సిపల్ అధికారుల రక్షణ పరికరాల కల్పనకు వాడుకోవచ్చు. ప్రభుత్వ అస్పత్రుల్లో థర్మల్ స్కానర్స్, ఇతర పరికరాల సమీకరణకు కూడా ఆ నిధులు వాడుకోవచ్చు. 

ఇవన్నీ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ నుంచే వాడుకోవాల్సి ఉంటుంది. నేషనల్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి వాడుకోకూడదు. పరికరాలపై వ్యయం వార్షిక కేటాయింపుల్లో పది శాతానికి మించకూడదు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !