బలవంతంగా విషం తాగించి హత్య.. కోర్టులో లొంగిపోయిన డీఎంకే ఎంపీ రమేష్...

By AN Telugu  |  First Published Oct 12, 2021, 11:44 AM IST

ఎంపీ సహాయకుడు నటరాజన్, ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు కందవేల్, అల్లాపిచ్చె, సుందర్, వినోద్ ను సీబీసీఐడీ వర్గాలు అరెస్ట్ చేశాయి. ఎంపీని కూడా అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. 


చెన్నై : కడలూరు DMK ఎంపీ రమేష్ సోమవారం బన్రూట్టి కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆదేశాలతో ఆయన్ని పోలీసులు రెండు రోజుల పాటు 
remandకు తరలించారు. తన పరిశ్రమలో పనిచేస్తున్న గోవిందరాజన్ అనే వ్యక్తిని హింసించడమే కాకుండా బలవంతంగా విషం తాగించి హతమార్చినట్లు mp ramesh మీద ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీ మీద cbcid హత్య కేసు నమోదు చేసింది. 

అలాగే ఎంపీ సహాయకుడు నటరాజన్, ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు కందవేల్, అల్లాపిచ్చె, సుందర్, వినోద్ ను సీబీసీఐడీ వర్గాలు అరెస్ట్ చేశాయి. ఎంపీని కూడా అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. 

Latest Videos

ఈ పరిస్థితుల్లో సోమవారం బన్రూట్టి కోర్టులో ఎంపీ రమేష్ లొంగిపోయారు. రిమాండ్ కు వెళ్లే సమయంలో ఎంపీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో తాను నిర్దోషినని, కొన్ని రాజకీయ పార్టీలు తన మీద వచ్చిన ఆరోపణల్ని రాజకీయం చేసే పనిలో పడ్డాయని, అందుకే కోర్టులో లొంగిపోయినట్లు తెలిపారు. 

click me!