కేరళలో వర్ష భీభత్సం... కొండచరియలు విరిగిపడి 12మంది గల్లంతు, వాయుసేన సహాయంకోరిన సీఎం

By Arun Kumar PFirst Published Oct 17, 2021, 10:07 AM IST
Highlights

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భాారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాలతో కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు  కోల్పోయారు. 

కొచ్చి: కేరళలో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రాష్ట్రంలోని ఇడుక్కిలో వరదల్లో ఒకరు మృతిచెందగా, కొట్టాయం జిల్లాల్లో  కొండచరియలు విరిగి ఇళ్లపై పడటంతో 12మంది గల్లంతయ్యారు.  

arabia సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో kerala తీర ప్రాంతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ఇడుక్కి జిల్లాలోని తోడుపుళలో వరదనీటిలో చిక్కుకుని ఒకరు చనిపోయారు. ఇక కొట్టాయం జిల్లాలో కొండచరియలు విరిగి ఇళ్లపై పడటంతో 12మంది గల్లంతయ్యారు. అయితే భారీ వర్షాల కారణంగా విపత్తు నిర్వహణ సిబ్బంది, స్థానిక పోలీసులు సహాయక చర్యలకు చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది.  

kottayam ఘటనపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్ సహాయక చర్యల కోసం కేంద్ర సాయాన్ని కోరారు. సహాయక చర్యల కోసం వాయుసేనను రంగంలోకి దింపాలను కేరక ప్రభుత్వం కోరింది. ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకే వైమానిక దళాలు సహకారం కోరినట్లు kerala cm pinarai vijayan కార్యాలయం వెల్లడించింది. 

కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాలని అధికారులు సీఎం విజయన్ ఆదేశించారు. మాస్కులు, సానిటైజర్లతో పాటు మంచినీరు,  మెడిసిన్స్ పునరావాస కేంద్రాల్లో అందుబాటులో వుంచాలని సీఎం సూచించారు.  

read more  వరద నీటిలో కొట్టుకుపోయిన కారు.. నీట మునిగిన బస్సు.. వీడియోలు వైరల్
 
 కొట్టాయంలో జిల్లాలో మొత్తం నాలుగు చోట్ల కొండచరియలు విరిగిపడినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద నీరు ఇళ్లలోకి నీళ్లు చేరడంతో 60 మంది వరకు చిక్కుకుపోయారని... వారిని సురక్షితంగా కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా అధికారులు తెలిపారు.   

భారీ వర్షప్రమాదం పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరించిన ఐదు జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. పథానంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇదుక్కి, త్రిస్సూర్‌ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, మరో ఏడు జిల్లాలు తిరువనంతపురం, కొల్లాం, అలప్పూజా, పాలక్కడ్, మలప్పురం, కోళికోడ్, వయానాడ్‌లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

ఆదివారం, సోమవారాల్లో ఈ అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచాన వేసింది. 19వ తేదీ ఉదయం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు బయట అడుగుపెట్టవద్దని, గుట్టలు, నదుల దగ్గరకు అసలే వెళ్లకూడదని సీఎం పినరయి విజయన్ కార్యాలయం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 

 

click me!