2024 జనవరిలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. ప్రజలను ఆహ్వానించిన యోగి ఆదిత్యనాథ్

By Asianet News  |  First Published May 25, 2023, 9:40 AM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఈ ఆలయ ప్రారంభం జరగనుంది. అయితే ఈ వేడుకకు ప్రజలు హాజరుకావాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆహ్వానం పలికారు. 


ఉత్తర్ ప్రదేశ్ లోని పవిత్ర నగరమైన అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. దీని కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది జనవరిలో రామ మందిరాన్ని ఘనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తూ అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ విస్తరణతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. సహదత్ గంజ్ నుంచి నయా ఘాట్ వరకు 13 కిలోమీటర్ల రహదారి అయిన రామ్ పథ్ నిర్మాణంలో పురోగతి ఉందని పేర్కొంది.

గంగిరెడ్డి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అసాధారణం - సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Latest Videos

రామజానకీ మార్గం, భక్తి మార్గం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు ఆ ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. సందర్శకుల తాకిడికి అనుగుణంగా విమానాశ్రయం, రైల్వేస్టేషన్లను విస్తరిస్తున్నామని పేర్కొంది. శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హి ఆలయాలకు భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే ఈ పరిణామాల లక్ష్యమని ఆ ప్రకటన పేర్కొన్నట్టు ‘పీటీఐ’ నివేదించింది.

నేడే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?

‘‘రామ జన్మభూమి మార్గం వెడల్పు 30 మీటర్లు, భక్తి మార్గం వెడల్పు 14 మీటర్లుగా ఉండనుంది. అయితే రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు ఆహ్వానం పలికారు. నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఆయన చురుగ్గా పర్యవేక్షిస్తున్నారు.’’ అని పేర్కొంది. 

అమెరికాలో మహబూబ్‌నగర్‌ యువకుడు మృతి.. ఏమైందంటే ?

అయోధ్యలోని దుకాణదారుల సహకారాన్ని కూడా ఈ ప్రకటన ప్రశంసించింది. ‘‘దుకాణాదారులు అద్భుతమైన మందిర నిర్మాణం, ఇతర సంబంధిత సౌకర్యాల కోసం తమ దుకాణ ప్రాంగణాన్ని ఇష్టపూర్వకంగా అందించారు. ప్రభుత్వ పరిహారం పంపిణీ ప్రక్రియ ఎలాంటి అవకతవకలకు తావులేకుండా సాగుతోంది. ప్రాజెక్టు ముంపునకు గురైన వారికి కొత్తగా అభివృద్ధి చేసిన సముదాయాల్లో దుకాణాలను కేటాయించాం. అంతేకాకుండా ఆస్తి యజమానుల సహకారంతో పలువురు దుకాణదారులను వారి స్వస్థలాలకు తరలించే ప్రయత్నాలు జరిగాయి.’’ అని ప్రకటన పేర్కొంది. 

click me!