హెల్మెట్ తో కుక్క.. దానిని చూసైనా మారండయ్యా..!

Published : May 25, 2023, 09:27 AM IST
హెల్మెట్ తో కుక్క.. దానిని చూసైనా మారండయ్యా..!

సారాంశం

 ఓ కుక్క బైక్ పై హెల్మెట్ పెట్టుకొని వెళుతూ అందరి దృష్టి ఆకర్షించింది. ఈ వీడియో తమిళనాడులో తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.  

మన దేశంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.  ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నవారిలో ఎక్కువ మంది కేవలం కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లే చనిపోతున్నారట. ఓ సర్వేలో తేలిన విషయం ఇది. బండి నడిపేవారు హెల్మెట్ పెట్టుకున్నా, వెనక కూర్చున్నవారు హెల్మెట్ లేకపోవడం వల్ల కూడా ప్రాణాలు పోతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో బండిమీద ప్రయాణం చేసే ఇద్దరూ తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి అని ట్రాఫిక్ పోలీసులు తరచూ మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా పట్టించుకునేవారే లేరు. అలాంటి వారంతా ఈ కుక్కను చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిందే,

 ఓ కుక్క బైక్ పై హెల్మెట్ పెట్టుకొని వెళుతూ అందరి దృష్టి ఆకర్షించింది. ఈ వీడియో తమిళనాడులో తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

 

. సాధారణంగా ఒక మనిషి హెల్మెట్ ధరించి బైక్ పై కూర్చోవడం చూస్తూనే ఉంటాం. కానీ కుక్క కూడా హెల్మెట్ ధరించి ఒక ప్యాసింజర్ లాగ బైక్ పై కూర్చోవడం ఆశ్చర్యకరం. ఈ వీడియోలో కుక్క హెల్మెట్ పెట్టుకొని కూర్చొని అందరికీ షాకిచ్చింది.ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి బైక్ నడుపుతున్న సమయంలో దాని వెనుక ఉన్న నల్లని కుక్క వెనక సీట్లో కూర్చొని, తన రెండు పాదాలను బైకు నడిపే వ్యక్తిపై పెట్టి,హెల్మెట్ ధరించి నిటారుగా ఉంది. 

ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కుక్క బైక్ మీద ఎక్కి కూర్చోవడమే గ్రేట్ అంటే హెల్మెట్ కూడా పెట్టుకుందని కొందరు కామెంట్స చేస్తున్నారు. మరి కొందరు ఈ కుక్కని చూసైనా నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఆ కుక్క యజమానిపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌