గడిచిన 10 ఏళ్లలో దేశంలోని కనీసం 25 కోట్ల మంది బహుముఖ పేదరికం (Multifaceted poverty) నుంచి విముక్తి పొందారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (union finance minister nirmala sitharaman) అన్నారు. పేదల సంక్షేమమే దేశ సంక్షేమం అని, పేదలు పురోగమించినప్పుడే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పారు. బడ్జెట్ ప్రసంగం (union budget 2024)లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
2024-2025 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో గురువారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె సభలో 57 నిమిషాల పాటు సుధీర్ఘంగా ప్రసగించారు. ఇందులో గత పదేళ్లలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రస్తావించారు. 2047 నాటికి విక్షిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.
Union Budget 2024 : 57 నిమిషాలే మాట్లాడిన నిర్మలా సీతారామన్.. అతి చిన్న ప్రసంగంగా రికార్డ్
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. పేదల సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత పదేళ్లలో కనీసం 25 కోట్ల మందికి బహుముఖ పేదరికం నుంచి విముక్తి లభించిందని చెప్పారు. పేదలు, మహిళా, యువత, అన్నదాతల ఆకాంక్షలు, అవసరాలను తీర్చడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆమె స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రక్రియలో పేదలు సాధికార భాగస్వాములు అయినప్పుడు, వారికి సహాయం చేసే ప్రభుత్వ శక్తి కూడా అనేక రెట్లు పెరుగుతుందని అన్నారు.
బడ్జెట్ 2024 హైలెట్స్ : పన్ను రేట్లు యథాతథం.. పీఎం స్వానిధి ద్వారా మరో 2.3 లక్షల మందికి లోన్లు..
పీఎం జన్ ధన్ ఖాతాలను ఉపయోగించి రూ.34 లక్షల కోట్ల ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) జరిగిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. దీని వల్ల ప్రభుత్వానికి 2.7 లక్షల కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. ఇది పేదల సంక్షేమాన్ని బలోపేతం చేసిందని ఆమె అన్నారు. పీఎం స్వనిధి పథకం కింద 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణ సహాయం అందించామని చెప్పారు. పీఎం విశ్వకర్మ యోజన కింద చేతివృత్తుల వారికి మద్దతుగా నిలిచామని అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద ప్రతీ సంవత్సరం సన్నకారు, చిన్నకారు రైతులతో సహా 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష నగదు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్
పేదల సంక్షేమమే దేశ సంక్షేమం అని, పేదలు పురోగమించినప్పుడే దేశం పురోగమిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆరోగ్య సంరక్షణ కవరేజీని ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లందరికీ వర్తింపజేస్తామని తెలిపారు. అలాగే మాతాశిశు ఆరోగ్య సంరక్షణ: మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కింద వివిధ పథకాలను సమగ్ర కార్యక్రమంగా క్రోడీకరించి అమలులో సమన్వయాన్నిపెంపొందించనున్నట్టు వెల్లడించారు.