యునైటెడ్ నేషన్స్ మానవహక్కుల కమిషన్ ఈ ఏడాది జూన్ లో మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసపై నివేదికను సమర్పించనుంది.
న్యూఢిల్లీ: మహిళలు, బాలికలపై హింసపై నివేదికల కోసం యూఎన్ స్పెషల్ రాపోర్చర్ ఉపయోగించిన పదజాలంపై పలువురు ఆందోళనకు దిగారు.మహిళా హక్కుల సంఘాలు, సెక్స్ వర్కర్లతో అనుబంధంగా 3,600 మంది ఆందోళనకు దిగారు.
ఈ ఏడాది జూన్ లో జరిగే యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల కమిషన్ 56వ సెషన్ లో మహిళలపై జరుగుతున్న హింసపై నివేదికను సమర్పించనుంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యభిచారం, మహిళలు, బాలికలపై హింస వంటి అంశాలపై నివేదికలో ప్రస్తావించనున్నారు.
undefined
అన్ని రకాల హింసల నుండి బాలికలు, మహిళల నుండి రక్షణ కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ నివేదిక పలు అంశాలను ప్రస్తావించనుంది. అయితే ఇందుకు సంబంధించిన నివేదిక కోసం యూఎన్ కు చెందిన ప్రతినిధి ఉపయోగించిన పదజాలంపై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి.
వ్యభిచారం చేసిన స్త్రీలు అనే పదజాలం ఉపయోగించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ పదజాలం ఉపయోగించడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పలు సంస్థల సభ్యులు యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల కమిషన్ హైకమిషనర్ కు 3640 మంది సభ్యులు పిటిషన్ సమర్పించారు.
ఈ మేరకు సెక్స్ వర్కర్స్ అండ్ అల్లీస్ సౌత్ ఏషియా(ఎస్‌డబ్ల్యుఏఎస్ఏ) తరపున న్యాయవాదులు వృందా గోవర్, ఆర్తీపాయ్ పిటిషన్ సమర్పించారు.
సెక్స్ వర్కర్ల పట్ల మర్యాదపూర్వకమైన భాషను తాము కోరుకుంటున్నట్టుగా శ్వాస సభ్యురాలు మీనా శేషు చెప్పారు.మానవ అక్రమ రవాణా, లైంగిక దోపీడీ వంటి పదజాలాన్ని నివారించడం చాలా ముఖ్యమని శ్వాస సభ్యులు అభిప్రాయపడ్డారు.
నేషనల్ నెట్ వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ (ఎన్ఎన్ఎస్‌డబ్ల్యు) కూడ ఈ విషయమై రాతపూర్వకంగా పిటిషన్ ను సమర్పించింది. దేశ వ్యాప్తంగా 1,50,000 మంది మహిళలు, ట్రాన్స్ జెండర్లు, పురుషులతో కూడిన పాన్ ఇండియా నెట్ వర్క్ ఇది.
వ్యభిచారం, వేశ్యస్త్రీలు, అనే పదాలు భారతీయ సందర్భంలో ఉపయోగించబడవని వారు గుర్తు చేశారు.భారత సుప్రీంకోర్టు హ్యాండ్ బుక్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.వేశ్య అనే పదాన్ని సెక్స్ వర్కర్ తో భర్తీ చేయాలని సూచించిన విషయాన్ని ఎన్ఎన్ఎస్‌డబ్ల్యు సభ్యులు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.వేశ్య, వేశ్య మహిళలు అనే పదాలను ఉపయోగించడం మానుకోవాలని కోరారు.