గతంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకుంటూ క్రికెటర్ మాయంక్ అగర్వాల్ (Mayank Agarwal) ఓ ఫన్నీ పోస్ట్ పెట్టారు.(Mayank Agarwal funny post) ఓ వాటర్ బాటిల్ ను చూపిస్తూ, సెల్పీ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా (Mayank Agarwal post viral) మారింది. ఇంతకీ అందులో అంత పెద్ద విషయమేం ఉందంటే ?
రంజీ ట్రోఫీ 2023-24లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ కు సన్నద్ధమవుతున్న సమయంలో విమానంలో వాటర్ బాటిల్ పట్టుకొని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి ఓ ఫన్నీ క్యాప్షన్ పెట్టారు. ‘అస్సలు రిస్క్ తీసుకోవడం లేదు’ అంటూ నవ్వుతూ వాటర్ బాటిల్ పట్టుకొని ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఏడాది జనవరిలో విమానంలోని పౌచ్ లో మంచి నీళ్లు అనుకొని ఏదో ద్రవం తాగి తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
మీది మొత్తం 1000 అయ్యింది.. యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా - హైదరాబాద్ పోలీసుల మీమ్.. వైరల్
కాగా.. తాజాగా మయాంక్ అగర్వాల్ చేసిన పోస్టు వైరల్ గా మారింది. వాటర్ బాటల్ ను చూపిస్తూ తీసుకున్న సెల్పీని పోస్ట్ చేస్తూ.. ‘‘బిల్కుల్ భీ రిస్క్ నహీ లెనే కా రే బాబావా (అస్సలు రిస్క్ తీసుకోవడం లేదు’’ అని క్యాప్షన్ పెట్టారు. ఆయన పోస్ట్ కు సోషల్ మీడియాలో ఫన్నీ రియాక్షన్స్ వస్తున్నాయి. అలాగే దీనికి ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఇప్పటి వరకు 121,000 కంటే ఎక్కువ లైక్స్, 450,000 వ్యూస్ సంపాదించింది.
న్యాయం చేస్తారని గదిలోకి వెళ్తే.. అత్యాచార బాధితురాలిపై జడ్జి లైంగిక వేధింపులు..
అగర్వాల్ పోస్ట్ వెనక కథ..
మయాంక్ అగర్వాల్ తన సహచరులతో కలిసి త్రిపురలో మ్యాచ్ ఆడారు. అనంరతం వారంత కలిసి న్యూఢిల్లీకి వెళ్లేందుకు విమానం ఎక్కారు. విమానం బయలుదేరడానికి కొద్దిసేపటి ముందు అగర్వాల్ కు దాహం వేసింది. దీంతో ముందు పౌచ్ లో ఉన్న ఓ బాటిల్ తీసుకొని, అందులో ఉన్నవి నీళ్లే అనుకొని తాగేశారు. విమానం బయలు దేరిన కొద్ది సేపటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఒకే ఎన్‌క్లోజర్‌లోకి అక్బర్, సీతా పేరున్న మగ, ఆడ సింహం.. కోర్టును ఆశ్రయించిన వీహెచ్ పీ
దీనిని విమాన సిబ్బంది గమనించారు. వెంటనే విమానాన్ని త్రిపుర రాజధాని అగర్తకు తరలించారు. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన వెంటనే అగర్తలలోని ఓ హాస్పిటల్ కు తరలించారు. మాయంక్ అగర్వాల్ కడుపు నొప్పి, వాపు, నోటిలో పుండ్లతో తీవ్ర నొప్పిని అనుభవించారు. ఏదో హానికర రసాయన పదార్థాన్ని తీసుకోవడం వల్లే ఇది జరిగిందని డాక్టర్లు గుర్తించారు. అనంతరం అగర్వాల్ ఈ ఘటనపై తన మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.