ప్రముఖ టీవీ నటుడు రితురాజ్ సింగ్ (59)మంగళవారం గుండెపోటుతో మరణించారు. కొంత కాలంగా ప్యాంక్రియాస్ సంబంధిత సమస్యలతో ఆయన చికిత్స పొందుతున్న ఆయనకు గత అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను వెంటనే ముంబాయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున కన్నుమూశారు.
రితురాజ్ సింగ్ అటు బుల్లితెర, ఇటు సినిమాల్లో నటించారు. రీసెంట్ గా పాపులర్ అయిన టీవీ షో 'అనుపమ'లో కనిపించారు ఇర్ఫాన్, సురేఖా సిక్రీ, ఆర్ మాధవన్ తదితరులతో కలిసి 'బనేగీ అప్నీ బాత్' సహా పలు ప్రముఖ టెలివిజన్ షోలలో నటించారు. 'కుతుంబ్', 'ఘర్ ఏక్ మందిర్', 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'దియా ఔర్ బాతీ హమ్' తదితర చిత్రాల్లో నటించారు. వరుణ్ ధావన్, అలియా భట్ లతో కలిసి 'హంప్టీ శర్మ కీ దుల్హనియా' చిత్రంలో నటించారు.
ఆయన మరణం పట్ల సోనూసూద్, వివేక్ అగ్నిహోత్రి, మనోజ్ బాజ్పాయ్, హన్సల్ మెహతా, కవితా కౌశిక్ వంటి, నిర్మాత సందీప్ సిక్చంద్ వంటి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.