అభివృద్దిలో దేశం దూసుకెళ్తుంది:జమ్మూలో పలు ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ

Published : Feb 20, 2024, 01:56 PM IST
అభివృద్దిలో దేశం దూసుకెళ్తుంది:జమ్మూలో పలు ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ

సారాంశం

దేశంలోని పలు ప్రాంతాల్లో ఐఐఎం, ఐఐటీ సంస్థలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.

న్యూఢిల్లీ:అభివృద్ది చెందిన భారతదేశం అంటే అభివృద్ది చెందిన జమ్మూ కాశ్మీర్ అని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. బీజేపీకి  370 సీట్లు, ఎన్‌డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.

 విశాఖలో ఐఐఎం, తిరుపతిలో ఐఐటీ, కర్నూల్ లో ఐఐటీ, హైద్రాబాద్ ఐఐటీని జమ్మూ కాశ్మీర్ నుండి వర్చువల్ గా  ప్రధాన మంత్రి సోమవారం నాడు ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ లో కూడ పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు పలు విద్యా సంస్థలను కూడ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో  ప్రధాని మోడీ ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్ ను అన్ని విధాలుగా అభివృద్ది చేసి తీరుతామన్నారు.మోడీ గ్యారంటీ అంటే ఇలానే ఉంటుందన్నారు.జమ్మూ కాశ్మీర్ నుండి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని  మోడీ చెప్పారు. కొన్నేళ్లుగా కాశ్మీర్ అభివృద్దిని ఎవరూ పట్టించుకోలేదని  మోడీ విమర్శించారు.కుటుంబ పాలన చేసేవారు ప్రజల కష్టాలను పట్టించుకోరన్నారు.

జమ్మూలో ఐఐటీ, ఐఐటీ కూడ ఉన్నాయని మోడీ చెప్పారు. మోడీ గ్యారంటీ అంటే హామీలు నెరవేర్చడమేనన్నారు. మీపై నాకు పూర్తి నమ్మం ఉంది. విక్షిత్ జమ్మూ కాశ్మీర్ ను చేస్తామని  మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. మీ 70 ఏళ్ల కలలను రాబోయే రోజుల్లో మోడీ నెరవేర్చనున్నారని ప్రధాని హామీ ఇచ్చారు. 

గతంలో జమ్మూ కాశ్మీర్ లో బాంబులు, కిడ్నాప్ లు, విభజన వంటి నిరాశజనక వంటి వార్తలు మాత్రమే వచ్చేవన్నారు. కానీ, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అభివృద్దిలో ముందుకు సాగుతుందని  మోడీ తెలిపారు.

దశాబ్దాలుగా  కాంగ్రెస్ అబద్దాలు చెబుతుందని మోడీ విమర్శించారు. దశాబ్దాల తరబడి వంశపారంపర్య రాజకీయాల భారాన్ని జమ్మూ కాశ్మీర్ భరించాల్సి వచ్చిందని  మోడీ విమర్శించారు.  తమ కుటుంబాల గురించి మాత్రమే ఆ పార్టీలు ఆందోళన చెందుతున్నాయన్నారు.  జమ్మూ కాశ్మీర్ కు విముక్తికి లభిస్తున్నందుకు తాను సంతోషిస్తున్నట్టుగా  మోడీ చెప్పారు.

గత 10 ఏళ్లలో  భారతదేశంలో పలు విద్యా సంస్థలను  ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఒక్క జమ్మూ కాశ్మీర్ లోనే 50 కొత్త డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసినట్టుగా మోడీ ప్రస్తావించారు.
 

2013 డిసెంబర్ లో   ఇక్కడ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సమయంలో జమ్మూలో ఐఐటీ, ఐఐఎం వంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయలేకపోతున్నారని ప్రశ్నించినట్టుగా ఆయన  చెప్పారు. ఆ హామీలను ఇవాళ నెరవేర్చినట్టుగా  మోడీ తెలిపారు. 

ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు సమగ్ర అభివృద్ది దిశగా పయనిస్తుందని చెప్పారు.

గత ప్రభుత్వాలు మన సైనికులను ఏనాడూ గౌరవించలేదని ఆయన విమర్శించారు. ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్ అంటూ 40 ఏళ్లుగా  కాంగ్రెస్ ప్రభుత్వం మన సైనికులకు అబద్దాలు చెబుతూ వచ్చిందని ఆయన విమర్శించారు. ఓఆర్‌పీని తెచ్చింది బీజేపీయేనన్నారు

ఒకప్పుడు పాఠశాలలను తగులబెట్టేవారు, ప్రస్తుతం పాఠశాలలను అలంకరిస్తున్నారన్నారు.  రాష్ట్రంలో ఆరోగ్య సౌకర్యాలు వేగంగా మెరుగుపడుతున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. 2014కు ముందు రాష్ట్రంలో  4 మెడికల్ కాలేజీలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 12కు చేరిందని మోడీ వివరించారు.

ఆర్టికల్ 370పై ఈ వారంలో సినిమా విడుదల కాబోతుందని విన్నానని మోడీ చెప్పారు.ఇది మంచి విషయమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు సరైన సమాచారం అందేలా చేస్తుందని మోడీ తెలిపారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Beers Price Drop : తెలుగోళ్లకూ కిక్కిచ్చే న్యూస్.. రూ.185 బీర్ ధర రూ.110 కి తగ్గిందోచ్..! మందుబాబులకు పండగే
Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu