కరెంటు ఛార్జీలు భరించలేకపోతే చెట్టు కింద కూర్చోండి.. ప్రజలకు అసోం స్పీకర్ బిశ్వజిత్ డైమరీ వింత సలహా..

By Asianet NewsFirst Published Jun 5, 2023, 12:52 PM IST
Highlights

కరెంటు ఛార్జీలు భరించలేకపోతే ప్రజలందరూ చెట్టు కింద వెళ్లి కూర్చోవాలని అస్సాం అసెంబ్లీ స్పీకర్ బిశ్వజిత్ డైమరీ వింత సలహా ఇచ్చారు. ఫ్యాన్లు ఆన్ చేసుకోవద్దని అన్నారు. ఆయన సలహాపై ప్రతిపక్ష కాంగ్రెస్, అస్సాం ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్ అసోసియేషన్ మండిపడింది.

కరెంటు ఛార్జీలు పెరిగాయని ఇబ్బంది పడుతున్న ప్రజలకు అస్సాం అసెంబ్లీ స్పీకర్ బిశ్వజిత్ డైమరీ ఓ సలహా ఇచ్చారు. విద్యుత్ ఛార్జీలు భరించలేని వారందరూ చెట్టు కింద కూర్చోవాలని, స్విచ్ లు ఆన్ చేయొద్దని సూచించారు. ‘‘విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. మీరు భరించలేకపోతే ఫ్యాన్ ల స్విచ్ ఆన్ చేయవద్దు. చెట్టుకింద కూర్చోండి’’ అని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం తరచూ విద్యుత్ ఛార్జీలు పెంచుతోందన్న విమర్శల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వ్యాపారాన్ని లాభాల్లో నడిపించేందుకు పూజ చేస్తానని బ్యూటీషియన్ పై అత్యాచారం..

ప్రభుత్వం కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుందని బిశ్వజిత్ డైమరీ చెప్పారు. ఆ కంపెనీలు ధరలు పెంచితే ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. టారిఫ్ పెంచడం ద్వారానే దానిని భర్తీ చేయాల్సి ఉంటుందని అన్నారు. దీనిని సమస్యగా మార్చొద్దని, అధికారాన్ని విచక్షణతో వినియోగించుకోవాలని అన్నారు. 

ఒడిశా రైలు ప్రమాదం.. గల్లంతైన వారి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఈ వ్యాఖ్యలపై వెంటనే ప్రతిపక్ష కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. అస్సాంను రాతియుగంలోకి నెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. డైమరీ వ్యాఖ్యలను ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా ఖండించారు. తమ పూర్వీకులు చెట్టుకింద కూర్చున్నారని అయితే కాలక్రమేణా కాంగ్రెస్ హయాంలో ప్రజలందరూ వెలుగులు, ఫ్యాన్ల కింద జీవించడం ప్రారంభించారని అన్నారు. మళ్లీ ఇప్పుడు వారు రాతియుగానికి తిరిగి వెళ్లాల్సి వస్తుందా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హెలికాప్టర్ లో ఎక్కడెక్కడ తిరుగుతున్నారని బోరా ప్రశ్నించారు.

అస్సాం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాఖ్య డే పుర్కాయస్త మాట్లాడుతూ.. స్పీకర్ వ్యాఖ్యల పరిశీలిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అర్థమవుతోందని ఆరోపించారు. సీఎం లోపభూయిష్ట విధానాలే ఈ దుస్థితికి కారణమని ఆరోపించారు. నిరంతరం పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడంలో బీజేపీ  ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు స్పీకర్ చెట్టు కింద కూర్చోవాలని సూచిస్తున్నారన్నారు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఒకటే పూట భోజనం చేయాలని, మరోపూట మానేయాలని ప్రభుత్వం సలహా ఇస్తుందేమో అని విమర్శించారు. 

విషాదం నింపిన రైలు ప్రమాదం.. చివరి క్షణంలో ఆగి, కుటుంబం మొత్తాన్ని కోల్పొయి ఒంటరిగా మిగిలిన యువకుడు..

ఇదిలా ఉండగా.. ఇటీవల అస్సాం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలను చెల్లించడానికి తన వినియోగదారుల నుంచి యూనిట్ కు 30 పైసల నుండి 70 పైసల అదనపు ఛార్జీలను వసూలు చేసింది. అయితే ఈ నిర్ణయంపై ఆల్ అస్సాం ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్ అసోసియేషన్, ప్రతిపక్షాలు, వివిధ సంఘాలు మండిపడ్డాయి.

click me!