వ్యాపారాన్ని లాభాల్లో నడిపించేందుకు పూజ చేస్తానని బ్యూటీషియన్ పై అత్యాచారం..

By Asianet NewsFirst Published Jun 5, 2023, 11:49 AM IST
Highlights

వ్యాపారాన్ని లాభాల్లో నడిపించేందుకు పూజ చేస్తానని నమ్మించి ఓ దుండగుడు మహిళపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు. 

ఆమె ఓ బ్యూటీషియన్.. సొంతంగా ఓ బ్యూటీపార్లర్ నడుపుతోంది. అయితే కొంత కాలం నుంచి ఆ వ్యాపారంలో నస్టాలు వస్తున్నాయి. అయితే దీనిని నివారించేందుకు ఆమె ఓ వ్యక్తిని ఆశ్రయించింది. అతడు ఆమె పరిస్థితిని మొత్తం విన్నాడు. వ్యాపారంలో లాభాలు వచ్చేలా తాను పూజలు చేస్తానని ఆమెను నమ్మించాడు. పూజలో భాగంగా ఆ మహిళ కుటుంబ సభ్యులందరినీ ఇంట్లో నుంచి పంపించాడు. అనంతరం ఆ బ్యూటీషియన్ పై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో వెలుగులోకి వచ్చింది.

ఒడిశా రైలు ప్రమాదం.. గల్లంతైన వారి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజ్నోర్ లో 32 ఏళ్ల మహిళా బ్యూటీ పార్లర్ నడుపుతోంది. కొంత కాలం నుంచి ఆమె తన వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటోంది. దీని నుంచి బయటపడేందుకు, వ్యాపారాన్ని లాభాల్లో నడిపించేందుకు ఆ మహిళ ఓ పూజలు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్లింది. ఆమె అవసరాన్ని అతడు అవకాశంగా మార్చుకోవాలని అనుకున్నాడు. పూజ చేసి పరిస్థితిని మొత్తం చక్కదిద్దుతానని ఆమెకు హామీ ఇచ్చాడు. తప్పకుండా వ్యాపారంలో లాభాలు వస్తాయని ఆమె నమ్మించాడు. 

ఒడిశా రైలు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. 2022 ఆడిట్ రిపోర్టులోనే రైలు భద్రతపై తీవ్ర ఆందోళన లేవనెత్తిన కాగ్..

పూజ చేసేందుకు నిందితుడు ఆ మహిళ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో పూజలు చేస్తానని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ ఉండకూడదని చెప్పాడు. కుటుంబ సభ్యులందరినీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాలని కోరాడు. బాధిత మహిళను మాత్రమే ఇంట్లో ఉండాలని సూచించాడు. అతడి మాటలు విని కుటుంబ సభ్యులందరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇదే మంచి సమయం అని భావించిన నిందితుడు ఆ మహిళపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. కొంత సమయం తరువాత బాధితురాలు కేకలు వినిపించడంతో ఆమె సోదరి పరిగెత్తుకొచ్చింది. బాధితురాలిని రక్షించింది.

విషాదం నింపిన రైలు ప్రమాదం.. చివరి క్షణంలో ఆగి, కుటుంబం మొత్తాన్ని కోల్పొయి ఒంటరిగా మిగిలిన యువకుడు..

కాగా.. ఈ ఘటనపై కొత్వాలి షహర్ ఎస్ హెచ్ వో సంజయ్ కుమార్ తోమర్ కేసు నమోదు చేసుకున్నారు. ‘‘బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా మేము నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. అతడిని అరెస్టు చేశాం. ప్రస్తుతం మా పోలీసులు అతడిని విచారిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా హాస్పిటల్ కు తరలించాం’’ అని అన్నారు.

click me!