తమిళనాడులో రైలు కోచ్‌ చక్రంలో పగుళ్లు, తప్పిన పెను ప్రమాదం..

By SumaBala BukkaFirst Published Jun 5, 2023, 12:32 PM IST
Highlights

పగుళ్లు కనిపించిన కోచ్‌ను రైలు నుండి వేరు చేసి, మరో కోచ్‌ని జోడించారు. దీంతో ఒక గంట ఆలస్యంగా ట్రైన్ బయలు దేరింది. పగుళ్లు ముందే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. 

తమిళనాడు : తమిళనాడులోని రైల్వే అధికారులు ఓ రైలు కోచ్ చక్రంలో పగుళ్లను గుర్తించారు. దీంతో భారీ విపత్తును నివారించారు. అధికారులు వెంటనే అప్రమత్తమవడంతో భారీ ప్రమాదం తప్పింది. కొల్లం-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ లోని ఓ కోచ్‌కు చెందిన చక్రంలో ఈ పగుళ్లు కనిపించాయి. వెంటనే ఆ కోచ్ ను ట్రైన్ నుంచి వేరు చేశారు. 

ఒడిశాలో 275 మంది మరణించిన, 1,200 మంది గాయపడిన భారీ విషాద ఘటన నుంచి ఇంకా దేశం కోలుకోకముందే.. మరో భయంకర ప్రమాదం తప్పింది. భారతదేశంలోనే అత్యంత ఘోరమైన బాలాసోర్ ప్రమాదానికి సాంకేతిక లోపం కారణమని ఆరోపిస్తున్నారు, అయితే విపత్తుకు గల కారణాలపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) చేపట్టాలని రైల్వే బోర్డు సిఫార్సు చేసింది.

ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్..

తమిళనాడులోని సెంగోట్టై రైల్వే స్టేషన్‌లో రోలింగ్ స్టాక్ పరీక్షలో ఆదివారం సాయంత్రం పగుళ్లు గుర్తించారు. దీనిమీద మాట్లాడుతూ.. "ఆదివారం మధ్యాహ్నం 3:36 గంటలకు తమిళనాడులోని సెంగోట్టై స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడు రైలు నంబర్ 16102.. S3 కోచ్‌లో సీ అండ్ డబ్ల్యూ సిబ్బంది పగుళ్లు గమనించారు" అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

వెంటనే అలర్ట్ అయ్యి.. ఆ కోచ్‌ను రైలు నుండి వేరు చేసి, దానికి బదులుగా మరో కోచ్‌ని జోడించారు. దీంతో ఆ రైలు ఒక గంట ఆలస్యంగా.. సాయంత్రం 4.40 గంటలకు స్టేషన్ నుండి బయలుదేరింది. "పగుళ్లను గుర్తించి.. ప్రమాదాన్ని నివారించిన సిబ్బందిని అధికారులు ప్రశంసించారు. వీరికి మధురై డివిజన్ డీఈఎమ్ ద్వారా అవార్డును అందజేస్తామని’’ అని దక్షిణ రైల్వే తెలిపింది.

ఇదిలా ఉండగా, ఒడిశాలోని బాలాసోర్‌లో ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత, భారతీయ రైల్వే సోమవారం ప్రమాద ప్రభావిత మార్గంలో సేవలను పునరుద్ధరించింది.కోల్‌కతాకు దక్షిణాన 250 కి.మీ, భువనేశ్వర్‌కు ఉత్తరాన 170 కి.మీ దూరంలో బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో జూన్ 2వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇందులో బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఉన్నాయి.

click me!