కేంద్రంలో కాంగ్రెస్ వస్తే.. మోడీని చంపేస్తా - సోషల్ మీడియాలో కర్ణాటక వాసి పోస్ట్..

By Sairam Indur  |  First Published Mar 5, 2024, 11:38 AM IST

ప్రధాని నరేంద్ర మోడీపై కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి హత్య బెదిరింపులకు పాల్పడ్డాడు (Karnataka man accused of threatening prime minister Narendra Modi with death threats). కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే నరేంద్ర మోడీని చంపేస్తానని అతడు ఓ వీడియోలో హెచ్చరించాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రధాని మోడీని చంపేస్తానని కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ పెట్టారు. దీంతో అక్కడి పోలీసులు స్పందించారు. ప్రధానిపై హత్య బెదిరింపులకు పాల్పడ్డ ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని మహ్మద్ రసూల్ కద్దారేగా గుర్తించిన పోలీసులు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

భార్యకు కవలలు జన్మించినా.. మొదట ప్రధానినే కలిసేందుకు వెళ్లిన నేత.. మోడీ భావోద్వేగం..

Latest Videos

మహమ్మద్ రసూల్ కద్దారే తన సోషల్ మీడియా చేసిన పోస్టులో.. కత్తి పట్టుకొని కనిపించారు. ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానని అందులో హెచ్చరిస్తున్నాడు.  కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధానిని హతమారుస్తానని హెచ్చరించాడు. దీంతో అతడిపై ఐపీసీ సెక్షన్ 505(1)(బి), 25(1)(బి), ఆయుధ చట్టం కింద యాదగిరిలోని సుర్పూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. 

Karnataka | An FIR has been registered against Mohammed Rasool Kaddare at Yadgiri's Surpur police station. He shared a video on social media where he threatened to kill PM Modi if the Congress government came to power at the Centre. FIR has been registered under section…

— ANI (@ANI)

కాగా.. గత ఏడాది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంను పేల్చివేస్తామని కేంద్ర భద్రతా సంస్థకు బెదిరింపు మెయిల్ వచ్చింది. రూ.500 కోట్లు ఇవ్వాలని, జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేపట్టింది.

నా జీవితం తెరిచిన పుస్తకం.. దేశం కోసం ఇంటిని వదిలిపెట్టాను - మోడీ

ఇదిలా ఉండగా.. గత ఏడాది మార్చిలో కర్ణాటకలోని దావణగెరెలో ప్రధాని మోదీ నిర్వహించిన ర్యాలీలో భద్రతా ఉల్లంఘన జరిగిన సంగతి తెలిసిందే.

click me!