యజమానిని చూసి గంతులేసిన కుక్క: సోషల్ మీడియాలో వైరలైన వీడియో

Published : Mar 05, 2024, 07:12 AM IST
యజమానిని చూసి గంతులేసిన కుక్క: సోషల్ మీడియాలో  వైరలైన వీడియో

సారాంశం

కుక్కలు తమ యజమానుల పట్ల అత్యంత విశ్వాసాన్ని చూపుతాయి.  ఇదే తరహా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

న్యూఢిల్లీ: జంతువులపై మనం ప్రేమ చూపితే  అంతకంటే ఎక్కువ ప్రేమను అవి మనకు తిరిగి ఇస్తాయి. అయితే ఓ యజమాని  విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన విషయాన్ని గుర్తించిన ఓ కుక్క  యజమాని ఇంట్లోకి వస్తున్న విషయాన్ని గుర్తించి ఎగిరి గంతులు వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. 

also read:వరంగల్ జిల్లాలో విషాదం: విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

చర్యకు ప్రతి చర్య ఉంటుందని న్యూటన్ సూత్రం. మనం  ఎదుటివారికి ప్రేమను పంచితే వారి నుండి అదే రకమైన ప్రేమను తిరిగి పొందొచ్చు. అయితే ఇది జంతవులకు కూడ వర్తిస్తుంది. ముఖ్యంగా విశ్వాసానికి కుక్కలను మారుపేరుగా చెబుతారు.   యజమాని పట్ల కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి.  

also read:సిక్స్‌ను అడ్డుకొని రనౌట్: సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో

ప్రస్తుత సమాజంలో  స్వార్థం పెరిగింది.  ప్రేమ, అభిమానం కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య పెరిగింది. అయితే  ఇలాంటి సమాజంలో  జంతువులపై ప్రేమ చూపే వారు అక్కడక్కడ కన్పిస్తుంటారు. తాము ప్రేమగా చూసుకొనే జంతువుల పట్ల వారు అత్యంత ప్రేమను కురిపిస్తారు. 

చిన్నప్పటి నుండి  కుక్కలను పెంచితే వాటి యజమానులపై ఆ కుక్కలు అమితమైన ప్రేమాభిమానాలను చూపిస్తాయి.ఓ వ్యక్తి, అతని కుక్క మధ్య లోతైన బంధాన్ని  చూపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంటి యజమాని వస్తున్న విషయాన్ని గుర్తించిన కుక్క  అటు ఇటు పరుగెత్తుతున్నట్టుగా కన్పించే వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ తల్లి బిడ్డ మధ్య ప్రేమను పోలి ఉందని కొందరు నెటిజన్లు ఈ వీడియోను చూసి వ్యాఖ్యానిస్తున్నారు.

 

ఇంటి యజమాని వస్తున్న విషయాన్ని గుర్తించిన కుక్క  ఉత్సాహంగా గంతులు వేయడం ఆ వీడియోలో కన్పిస్తుంది.సయాన్ ఖస్త్‌గిర్ అనే నెటిజన్  ఇన్‌స్టాగ్రామ్ లో  ఈ వీడియోను షేర్ చేశారు.ఈ వీడియో షేర్ చేసిన గంటల వ్యవధిలోనే  14.6 మిలియన్ల మంది వీక్షించారు.  అంతేకాదు ఈ వీడియోకు  1.2 మిలియన్ల లైక్ లు వచ్చాయి.  ప్రతి హోం కమింగ్ ఇలానే ఉంటుందని  క్యాప్షన్ తో ఈ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోపై  కొందరు నెటిజన్లు భావోద్వేగంగా పోస్టులు పెట్టారు.

PREV
click me!

Recommended Stories

Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu