కర్ణాటక పోలీస్ శాఖ హెచ్చరిక : పోలీసులు ‘‘ఫ్యామిలీ ప్యాక్‌’’లు తగ్గించకుంటే సస్పెన్షనే..

First Published Jul 10, 2018, 6:13 PM IST
Highlights

పోలీసులు ఫిట్‌గా ఉండాలనే కామెంట్లు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైంది. ఏకంగా ముఖ్యమంత్రులు సైతం పోలీసులను క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.. తాజాగా పోలీసులు ఫిట్‌గా లేకపోతే సస్పెండ్ చేస్తామంటూ హుకుం జారీ చేసింది కర్ణాటక పోలీస్ శాఖ

పోలీసులు ఫిట్‌గా ఉండాలనే కామెంట్లు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైంది. ఏకంగా ముఖ్యమంత్రులు సైతం పోలీసులను క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.. తాజాగా పోలీసులు ఫిట్‌గా లేకపోతే సస్పెండ్ చేస్తామంటూ హుకుం జారీ చేసింది కర్ణాటక పోలీస్ శాఖ.

ఆ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ... నిర్దేశిత బరువు కంటే ఎక్కువ ఉన్న పోలీసులు తప్పనిసరిగా వెయిట్ తగ్గించుకోవాలని లేని పక్షంలో సర్వీస్ నుంచి సస్పెండ్ చేయడం కానీ.. సర్వీసులో కఠినమైన విధులు.. ఎక్స్‌ట్రా డ్యూటీలు వేస్తామని చెప్పారు. హెల్తీగా.. ఫిట్‌నెస్ కలిగిన వ్యక్తులను దేశం కోరుకుంటోందని... ఇందుకు అనుగుణంగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ క్యాంటీన్లలో ఆరోగ్యకరమైన భోజనం ఉండేలా ఏర్పాట్లు చేస్తామని ఏడీజీపీ తెలిపారు.

బరువు ఎక్కువున్న పోలీసులు బరువు ఎలా తగ్గించుకోవాలో అవగాహన కల్పిస్తామన్నారు... గడువులోగా పోలీసులు బానపొట్టలు తగ్గించుకోని పక్షంలో కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

click me!