అమ్మాయి పక్కనుంచి లేవమన్న సీనియర్.. కుదరదన్న జూనియర్.. ఆ తర్వాత..

Published : Jul 10, 2018, 03:01 PM IST
అమ్మాయి పక్కనుంచి లేవమన్న సీనియర్.. కుదరదన్న జూనియర్.. ఆ తర్వాత..

సారాంశం

అమ్మాయి పక్కనే కూర్చోవాలన్న ఆశ ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీయడంతో పాటు హత్యాయత్నం వరకు వెళ్లింది

అమ్మాయి పక్కనే కూర్చోవాలన్న ఆశ ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీయడంతో పాటు హత్యాయత్నం వరకు వెళ్లింది. కోల్‌కతాలోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థులు సాయంత్రం తరగతులు ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లేందుకు బస్సెక్కారు. 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఓ అమ్మాయి పక్కన సీట్లో కూర్చోవాలనుకున్నాడు.. కానీ అప్పటికే ఆమె పక్కన 10వ తరగది విద్యార్థి కూర్చొన్నాడు.. వెంటనే  అతని వద్దకు వెళ్లి.. ఆ అమ్మాయి తన గర్ల్‌ఫ్రెండ్ అని అక్కడి నుంచి లేచి మరో చోట కూర్చోవాలని బెదిరించాడు..

కానీ ఆ బెదిరింపులకు జూనియర్ విద్యార్థి ఏ మాత్రం లొంగలేదు.. దీంతో సీనియర్ విద్యార్థికి సహనం నశించి గొడవకు దిగాడు.. అది తారాస్థాయికి చేరింది.. ఇద్దరికి నచ్చజెప్పేందుకు పలువురు ప్రయత్నించినప్పటికి ఎవరూ తగ్గలేదు.. గొడవ పెద్దది అవుతుండటంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపాడు.. ఈ సమయంలో సీనియర్ విద్యార్థి రోడ్డు మీదున్న స్టాల్‌లో కత్తిని తీసుకుని జూనియర్‌పై దాడి చేశాడు.. దీంతో విద్యార్థులు, డ్రైవర్ తదితరులు సీనియర్ విద్యార్థిని అడ్డుకున్నారు.. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించి.. సీనియర్‌ను పోలీసులకు అప్పగించారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?