లోపాలు, చైనా టెస్టింగ్ కిట్స్ వెనక్కి: కేంద్రం కీలక నిర్ణయం

By narsimha lode  |  First Published Apr 27, 2020, 4:35 PM IST

చైనా టెస్టింగ్ కిట్స్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. చైనా టెస్టింగ్ కిట్స్ ను వెనక్కి పంపాలని రాష్ట్రాలను కోరింది ఐసీఎంఆర్.


న్యూఢిల్లీ: చైనా టెస్టింగ్ కిట్స్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. చైనా టెస్టింగ్ కిట్స్ ను వెనక్కి పంపాలని రాష్ట్రాలను కోరింది ఐసీఎంఆర్.

 సోమవారం నాడు సాయంత్రం ఐసీఎంఆర్ అధికారులు అన్ని రాష్ట్రాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీన చైనా టెస్టింగ్ కిట్స్ ను ఉపయోగించకూడదని ఐసీఎంఆర్ రాష్ట్రాలకు సూచించింది. రెండు రోజుల పాటు ఈ టెస్టింగ్ కిట్స్ ద్వారా ఎలాంటి పరీక్షలు నిర్వహించవద్దని సూచించింది. 

Latest Videos

క్షేత్రస్థాయిలో ఐసీఎంఆర్ సిబ్బంది  ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ లో పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఈ విషయమై ఓ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టుగా ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ రామన్  ప్రకటించిన విషయం తెలిసిందే. 

also read: కరోనా పరీక్షలకు రెండు రోజులు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ వాడొద్దు: ఐసీఎంఆర్ కీలక సూచన

రెండు రోజుల తర్వాత కొత్త మార్గదర్శకాలను వెల్లడిస్తామని ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ అదే రోజున చెప్పారు..కేంద్రం నుండి కొత్త మార్గదర్శకాలు వచ్చే వరకు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ను ఉపయోగించకూడదని ఆయన అన్ని రాష్ట్రాలను కోరారు.

ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ పై రాజస్థాన్ ఇదివరకే కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇతర రాష్ట్రాల నుండి కూడ ఇదే రకమైన ఫిర్యాదులు రావడంతో ఐసీఎంఆర్ క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహించింది. క్షేత్రస్థాయిలో పర్యటన తర్వాత ఐసీఎంఆర్ ఈ నిర్ణయం తీసుకొంది. 

ఐసీఎంఆర్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సోమవారం నాడు లేఖ రాసింది.ఈ లేఖలో ఆర్‌టీ-పీసీఆర్ త్రోట్, నాసాల్  స్వాబ్ టెస్ట్  ర్యాపిడ్ టెస్టులకు అత్యంత ఉత్తమమైందని పేర్కొంది.

చైనాకు చెందిన గ్వాంగ్ జౌ వాండ్ ఫో బయోటెక్, జుహైలివ్జోసన్ డయాగ్నోస్టిక్స్ కిట్స్ ను వాడడం మానేయాలని సూచించింది.

click me!