కరోనా పరీక్షలు రోజూ 15 వేలే: సుప్రీంకు కేంద్రం స్టేటస్ రిపోర్టు

By narsimha lodeFirst Published Apr 27, 2020, 4:09 PM IST
Highlights

ప్రతి రోజూ 15 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. సోమవారం నాడు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సుప్రీంకోర్టుకు రెండో స్టేటస్ రిపోర్టును సమర్పించింది.


న్యూఢిల్లీ: ప్రతి రోజూ 15 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. సోమవారం నాడు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సుప్రీంకోర్టుకు రెండో స్టేటస్ రిపోర్టును సమర్పించింది.

ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ వరకు తీసుకొన్న చర్యలను ప్రస్తావిస్తూ  సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్టును కేంద్రం సమర్పించింది. ఈ రిపోర్టులో  జనవరి నాటికి దేశంలో ఒకే టెస్టింగ్ ల్యాబ్ ఉందని తెలిపింది. ఏప్రిల్ 9వ తేదీ నాటికి దేశంలో 139 ల్యాబ్ లు అందుబాటులోకి వచ్చాయని ప్రకటించింది.

ఈ రిపోర్టు కంటే ముందే మార్చి 31వ తేదిన  సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఈ రిపోర్టులో దేశంలో 118 టెస్టింగ్ ల్యాబ్ లు ఉన్నాయని తెలిపింది. మార్చి 31 నుండి ఏప్రిల్ 9వకు ల్యాబ్ ల సంఖ్య పెరిగింది. కానీ, ప్రతి రోజూ 15 వేల మేరకే పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా ఈ రిపోర్టులో ప్రకటించింది.

ప్రభుత్వ లేబొరేటరీలతో పాటు ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లోనూ టెస్టింగ్‌ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చినట్టు కేంద్రం ఈ స్టేటస్ రిపోర్టులో వెల్లడైంది. మార్చి 31న దాఖలైన అఫిడవిట్‌లో 47 ప్రైవేట్‌ ల్యాబ్‌లను టెస్ట్‌ల కోసం అనుమతిస్తున్నట్టు పేర్కొనగా, ఏప్రిల్‌ 9న ప్రైవేట్‌ ల్యాబ్‌ల సంఖ్య 67గా పేర్కొన్నారు. 

also read:లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్: ట్యూటర్ ఇంటిని పోలీసులకు చూపిన బాలుడు

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ల్యాబ్ లో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వానికి సంబందించిన ల్యాబ్ ల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్ లో కరోనా పరీక్షలుకు అనుమతి లభించినా కేసీఆర్ సర్కార్ మాత్రం ప్రైవేట్ ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించడం లేదు.
 

click me!