
న్యూఢిల్లీ: ఖాళీ సమయాల్లో టీ తాగేందుకు తాను ఎక్కువగా ఇష్టపడతానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.
బుధవారం నాడు సినీ నటుడు అక్షయ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేశారు. రాజకీయాల నుండి రిటైరైన తర్వాత తాను అడవుల్లో ప్రశాంతత కోసం తిరుగుతానని మోడీ చెప్పారు.
రేడియో, మొబైల్ లేకుండా ప్రకృతి ఒడిలో ప్రశాంతతను కోరుకొంటానని ఆయన వివరించారు. టీ విక్రేతగా తాను పనిచేసిన సమయంలో చాలా మందితో తాను సంభాషించే అవకాశం లభించిందన్నారు. అంతేకాదు హిందీ భాష కూడ నేర్చుకొనేందుకు గాను టీ అమ్మకం దోహదం చేసిందని ఆయన గుర్తు చేసుకొన్నారు.
సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొనే సమయాల్లో తనకు టీమ్ స్పిరిట్ గురించి తెలుసుకొన్నట్టుగా ఆయన చెప్పారు. అదే తనకు నాయకత్వ లక్షణాలను కూడ నేర్పిందని తెలిపారు.
సంబంధిత వార్తలు
సినిమాలు చూడలేకపోతున్నా: అక్షయ్ కుమార్‌తో మోడీ
అమ్మ నాకు డబ్బులిస్తోంది: నరేంద్ర మోడీ
మిత్రులతో ఇప్పటికి సరదాగానే ఉంటా: మోడీ
ఆర్మీలో చేరాలని ఉండేది: అక్షయ్‌కుమార్ ఇంటర్వ్యూలో మోడీ