అయోధ్యలో రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: రాముడిని కోట్ల గళాలు స్మరించాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సర్ సంచాలక్ మోహన్ భగవత్ చెప్పారు. రాముడి త్యాగానికి, పరిశ్రమకు నమస్సులన్నారు.అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ధర్మం, త్యాగనిరతికి రాముడు ప్రతీక అని మోహన్ భగవత్ పేర్కొన్నారు.సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లడమే మన ధర్మమని మోహన్ భగవత్ చెప్పారు.పేదల సంక్షేమం కోసం కేంద్రం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిబద్దతను మోహన్ భగవత్ ప్రస్తావించారు. అయోధ్యలో రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్టకు రాక ముందు 11 రోజుల పాటు ప్రధాన మంత్రి కఠినమైన ఉపవాసం ఉన్నారన్నారు. మోడీ తనకు చాలా కాలంగా తెలుసునన్నారు. ఆయన ఓ తపస్వి అని ఆయన అన్నారు.
ఇవాళ అయోధ్యలో రామ్ లల్లాతో పాటు భారత దేశం గర్వపడే క్షణమని ఆయన చెప్పారు. ప్రపంచానికి విషాదాల నుండి విముక్తి కలిగించే నయా భారత్ తప్పకుండా వస్తుందనడానికి నేటి కార్యక్రమం ప్రతీకగా నిలుస్తుందని మోహన్ భగవత్ చెప్పారు.
500 ఏళ్ల శ్రీరాముడి 'అజ్ఞాతవాసానికి ముగింపు పలుకుతూ రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఏడు వేల మందికి నిర్వాహకులు ఆహ్వానాలు పంపారు.
also read:అయోధ్యలో రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ట: రామ్ లల్లా (ఫోటోలు)
అయోధ్య రామ మందిరంలోని గర్బగుడిలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలి హరతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అయోధ్యకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు పూజలు ప్రారంభమయ్యాయి. ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం మోడీ ఆలయంలో అడుగు పెట్టడంతో ఈ కార్యక్రమం కోసం ఉత్సాహం, ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకున్నాయి.