అవును.. బిస్కెట్ ను కుక్క యజమానికి ఇచ్చాను.. అందులో తప్పేముంది - వైరల్ వీడియోపై రాహుల్ గాంధీ

By Sairam IndurFirst Published Feb 6, 2024, 3:59 PM IST
Highlights

భారత్ జోడో న్యాయ్ యాత్ర (bharat jodo nyay yatra)లో తన మద్దతుదారుడికి కుక్క బిస్కెట్లు (dog biscuits) ఇచ్చాడని చూపిస్తున్న వైరల్ వీడియో రాహుల్ గాంధీ (Rahul gandhi) స్పందించారు. తాను చేసిన దాంట్లో తప్పేమి లేదని అన్నారు. బిస్కెట్లను కుక్క యజమానికి ఇచ్చానని అన్నారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారు. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. అయితే జార్ఖండ్ లో ఈ యాత్ర చేస్తున్న సమయంలో తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. కుక్క బిస్కెట్లు తినకపోతే, దానిని అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తకు రాహుల్ గాంధీ ఇచ్చారు. ఈ వీడియోపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ కూడా మండిపడ్డారు. తాను కూడా కుక్క బిస్కెట్లు తినేందుకు నిరాకరించానని, అందుకే పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు.

రూ.1800 కోట్ల గ్రాంట్లు విడుదల చేయండి.. నీతి అయోగ్ కు తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి

Latest Videos

ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందించారు. తాను చేసినదాంట్లో తప్పులేదని స్పష్టం చేశారు. తన చేతిలోకి తీసుకోగానే కుక్క భయంతో వణికిందని అన్నారు. వెంటనే దాని యజమానిని పిలిచానని అన్నారు. కుక్క భయంతో ఉండటంతో బిస్కెట్ ను, కుక్కను యజమానికి అప్పగించానని అన్నారు. అతడు తినిపేస్తే కుక్క ఆ బిస్కెట్లను తిన్నదని తెలిపారు. ఇందులో ఉన్న సమస్య ఏమిటని ఆయన ప్రశ్నించారు.

అసలేం జరిగిందంటే ? 
జార్ఖండ్ లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఓ కుక్కకు బిస్కెట్ ఇస్తున్న వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో కుక్క బిస్కెట్లను ఓ వ్యక్తికి రాహుల్ గాంధీ ఇస్తున్నారు. దీంతో కుక్క తినే బిస్కెట్లను తన కార్యకర్తకు రాహుల్ గాంధీ ఇచ్చారని ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు.

మురికి కుంటలో వివాహ వార్షికోత్సవం.. బ్యాండ్ లు కొడుతూ డ్యాన్స్ చేసిన స్థానికులు..ఎందుకంటే ?

కాగా.. వణుకుతున్న కుక్కపిల్లను రాహుల్ గాంధీ ఎత్తుకుని బిస్కెట్ ఇస్తున్న వీడియోను భారత్ జోడో న్యాయ్ యాత్ర అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ షేర్ చేసింది. అందులో బిస్కెట్లను యజమానికి ఇవ్వడం కనిపించడం లేదు. అయితే, ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ షేర్ చేసిన మరో వీడియోలో ఈ ఘటనను భిన్నంగా చూపించారు. అందులో బిస్కెట్ తినడానికి కుక్క నిరాకరించడం, దానిని తన మద్దతుదారుడికి ఇచ్చినట్టు కనిపిస్తుంది. తరువాత ఏం జరిగిందో చూపించలేదు. 

మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ..

దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. బీజేపీ నేతలు దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తన మద్దతుదారులను అవమానించారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలను కుక్కలతో పోలుస్తూ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు, ఈ ఘటనకు మధ్య సంబంధాన్ని మాలవీయ ఎత్తిచూపడంతో ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. 

click me!