‘మొదటి హెచ్చరికకు స్పందించలేదు.. నాకిప్పుడు రూ.200 కోట్లు కావాలి’- ముఖేష్ అంబానీకి మళ్లీ బెదిరింపులు..

By Asianet News  |  First Published Oct 29, 2023, 2:39 PM IST

భారత కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి వరుసగా రెండో రోజు బెదిరింపు మెయిల్ వచ్చింది. మొదటి హత్యా బెదిరింపు మెయిల్ కు స్పందించలేదని, అందుకే తనకు ఇప్పుడు రూ.200 కోట్లు కావాలని అగంతకుడు హెచ్చరించాడు. 


ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మళ్లీ బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఓ అంగతకుడి మెయిల్ నుంచి ప్రాణహాని హెచ్చరికలు వచ్చాయి. అయితే వాటికి అంబానీ స్పందించకపోవడంతో మరో సారి అలాంటి బెదిరింపులే వచ్చాయి. అయితే శుక్రవారం రూ.20 కోట్లు అడిగిన దుండగుడు.. ఈ సారి రూ.200 కోట్లు డిమాండ్ చేశాడు.

రియల్ హీరో.. గుండె నొప్పితో ప్రాణాలు పోతున్నా..చాకచక్యంతో 48 మందిని కాపాడిన బస్సు డ్రైవర్..

Latest Videos

undefined

శుక్రవారం బెదిరింపులు వచ్చిన అదే ఈ- మెయిల్ ఖాతా నుంచి మరో సారి కూడా ముఖేష్ అంబానీకి ప్రాణహాని వచ్చింది. ఈసారి రూ.200 కోట్లు డిమాండ్ చేశారని, గతంలో పంపిన ఈమెయిల్ కు స్పందించకపోవడంతో ఈ మొత్తాన్ని రూ.20 కోట్ల నుంచి రూ.200 కోట్లకు పెంచినట్లు పోలీసు వర్గాలు ‘ఇండియా టుడే’కు తెలిపాయి.

సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ సీసీ గడిల విష్ణువర్ధన్‌ అనుమానస్పద మృతి..

తాజా మెయిల్ లో ‘‘మీరు మా ఈమెయిల్ కు స్పందించలేదు. ఇప్పుడు ఆ మొత్తం రూ.200 కోట్లు, లేదంటే డెత్ వారెంట్ పై సంతకం అయిపోతుంది’’ అని దుండుగుడు హెచ్చరించాడు. అదే ఐడీ నుంచి ఇంతకు ముందు వచ్చిన మెయిల్ లో ‘‘మాకు రూ.20 కోట్లు ఇవ్వు. లేకపోతే చంపేస్తాం. భారత్ లో మాకు అత్యుత్తమ షూటర్లు ఉన్నారు’’ అని బెదిరింపులకు గురి చేశాడు. 

ఆ మెయిల్ పై ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇంఛార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  గాందేవి పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 387 (ప్రాణభయం లేదా తీవ్రంగా గాయపరచడం), 506 (2) (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. 

విషాదం.. ఒకే ఇంట్లో ఏడుగురి కుటుంబ సభ్యుల సూసైడ్.. కారణమేంటంటే ?

కాగా.. ముఖేష్ అంబానీకి హత్యా బెదిరింపులు రావడం ఇవే మొదటిసారి కాదు. గతేడాది కూడా అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు హత్యా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ ఘటనలో బీహార్ లోని దర్భంగాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగి అయిన నిందితుడిని రాకేష్ కుమార్ మిశ్రాగా గుర్తించారు. అతడు ముఖేశ్ అంబానీ కుటుంబాన్ని, ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ను పేల్చివేస్తానని బెదిరించాడు.

click me!